స‌జ్జ‌ల సైడ‌య్యారా.. సైడ్ చేశారా….? వైసీపీలో గుస‌గుస‌

వైసీపీ కీల‌క నాయ‌కుడు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి గురించి అంద‌రి కీ తెలిసిందే. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌ర్వాత‌.. ముఖ్య‌మంత్రిగా ఆయ‌నే చ‌క్రం తిప్పుతున్నార‌ని.. కొన్నాళ్లుగా వైసీపీలోనే చ‌ర్చ న‌డిచింది. ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. ఆయన ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం.. ఆయ‌న ప‌రిష్క‌రించ డం.. ఎక్క‌డ ఏ మంత్రి దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. కంట్రోల్ చేయ‌డం.. ఇలా.. అనేక రూపాల్లో స‌జ్జ‌ల ప్రాధా న్యం అంద‌రికీ తెలిసిందే.

మ‌రీ ముఖ్యంగా కీల‌క విష‌యాల్లో మంత్రులు చేయాల్సిన ప్ర‌క‌ట‌న‌లు కూడా ఆయ‌నే చేశారు. ఇక‌, ప్ర‌భుత్వ న‌నిర్ణ‌యాల‌ను కూడా ఆయ‌నే ప్ర‌క‌టించేవారు. పార్టీలోనూ.. ప్ర‌బుత్వంలోనూ.. ఆయ‌న నెంబ‌ర్ 2గా ఉన్నార‌ని.. ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఇక‌, సొంత పార్టీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ రాజు ఏకంగా.. స‌జ్జ‌ల‌పై కోర్టుకు కూడా వెళ్లారు. ఆయ‌న స‌ల‌హాదారు మాత్ర‌మేన‌ని..ఆయ‌న ఎలా విధాన‌ప‌ర మైన నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని.. ప్ర‌శ్నించారు.

ఆయ‌న‌ను స‌క‌ల శాఖా మంత్రిగా కూడా పేర్కొన్నారు. ఉద్యోగుల‌తో చ‌ర్చించాల్సి వ‌చ్చిన‌ప్పుడు కూడా.. స‌జ్జ‌ల నేతృత్వంలోనే క‌మిటీ వేశారు. ఇలా.. అనేక రూపాల్లో ప్రాధాన్యం ఉన్న స‌జ్జ‌ల‌.. ను ఇప్పుడు సైడ్ చేశారా? అనే సందేహాలు వైసీపీలో వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల గుంటూరు వేదిక‌గా జ‌రిగిన వైసీపీ ప్లీన‌రీలో స‌జ్జ‌ల ఎక్క‌డా క‌నిపించ‌లేదు. అంటే.. క‌నిపించారు. కానీ, వేదిక‌పై మాత్రం ఆయ‌న కు సీటు వేయ‌లేదు. ఆయ‌న గంభీర‌మైన ప్ర‌సంగం కూడా చేయ‌లేదు.

ఈయ‌న స్థానంలో అన్నీ.. ఎంపీ.. విజ‌య‌సాయిరెడ్డి చూసుకున్నారు. తీర్మానాలు ప్ర‌వేశ పెట్ట‌డం నుంచి జ‌గ‌న్‌ను పార్టీకి శాశ్వ‌త అధ్య‌క్షుడిని చేయ‌డం వ‌ర‌కు కూడా.. అన్నీ సాయిరెడ్డే చూసుకున్నారు. దీంతో స‌జ్జ‌ల కేవ‌లం డ‌యాస్ కింద‌నే ఉండిపోయారు. మీడియాకు మాత్రం బ్రీఫింగ్ ఇచ్చారు. ఈ ప‌రిణామాల ను గ‌మ‌నించిన సీనియ‌ర్ నాయ‌కులు స‌జ్జ‌లను సైడ్ చేశారా? అనే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యం వ‌స్తున్న నేప‌థ్యంలో కొన్ని త‌ల‌నొప్పులు వ‌దిలించుకునేందుకు జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తున్నారా? అనే చ‌ర్చ కూడా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Share post:

Latest