ఏపీలో బీజేపీ బిగ్ టార్గెట్‌… కొత్త ఆట మొద‌లు పెట్టేసింది…!

ఏపీలో బీజేపీ వ్యూహం బాగానే ఉంది. ఏకంగా 10 నుంచి 15 అసెంబ్లీ.. 5 నుంచి 6 పార్ల‌మెంటు స్థానాల్లో విజ యం ద‌క్కించుకునేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. పార్ల‌మెంటు స‌భ్యుల విష‌యంలో కేం ద్రం .. అసెంబ్లీ విష‌యంలో రాష్ట్ర నాయ‌క‌త్వం క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కేంద్రం.. త‌ర‌చు గా కేంద్ర మంత్రుల‌ను ఎంపిక చేసిన నియోజ‌క‌వ‌ర్గాల‌కు పంపుతున్న విష‌యం గ‌మ‌నార్హం. ముఖ్యంగా పోల వ‌రం ప్రాంతానికి కేంద్ర మంత్రులు వస్తున్నారు.

ఇక్కడ ప్రాజెక్టు నిర్వాసితుల‌కు తాము న్యాయం చేస్తున్నామ‌ని..చెబుతున్నారు. త‌ద్వారా.. బీజేపీ పుంజు కునేందుకు ఉన్న అవ‌కాశంపై వారు అంచ‌నా వేస్తున్నారు. అదేవిధంగా విశాఖ‌, తిరుప‌తి పార్ల‌మెంటు స్థానాల‌పైనా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇక‌, మ‌రోవైపు.. పొత్తు ఉన్నా లేకున్నా.. ప‌ది నుంచి 15 అసెంబ్లీ స్థానాల్లో దూసుకుపోయేందుకు ఉన్న ఛాన్స్‌పైనా లెక్క‌లు వేసుకుంటున్నారు. అయితే.. ఇవే వీ అంత ఈజీకాదు. ప్ర‌స్తుతం అయితే.. వైసీపీ లేక‌పోతే.. టీడీపీ అన్న‌ట్టుగా ప్ర‌జ‌ల మూడ్ ఉంది.

దీనిని త‌మ‌వైపు తిప్పుకోవాలంటే.. స్తానిక నాయ‌క‌త్వం ఒక్క‌టే స‌రిపోద‌ని.. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూ రంగా ఉన్న మాజీ నాయ‌కుల అవ‌సరం ఎంతైనా ఉంద‌ని.. పార్టీ అధిష్టానం భావిస్తోంది. వీరిలో కామినేని శ్రీనివాస‌రావు కావొచ్చు.. కావూరి సాంబ‌శివ‌రావు.. కావొచ్చు.. ఇలా ఇత‌ర నేత‌ల సాయం తీసుకుని.. వారికి పార్టీలో ప‌ద‌వులు ఇచ్చేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నార‌ని స‌మాచారం. కేవ‌లం పైపై ప్ర‌చారం తోనే కాకుండా.. కీల‌క నేత‌ల‌కు కూడా బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని చూస్తున్నారు.

అదే స‌మ‌యంలో సామాజిక వ‌ర్గాల ప‌రంగా కూడా ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నా యి. ఎక్క‌డిక‌క్క‌డ రెడ్డి, క‌మ్మ‌, కాపు నాయ‌కుల‌ను ఏకం చేసేందుకు లేదా.. వారి ద్వారా.. ఆయా వ‌ర్గాల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. అదేస‌మ‌యంలో క్ష‌త్రియ వ‌ర్గం.. బీజేపీతోనే ఉన్న‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఆయా నేత‌ల‌ను క‌లిసి.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై వ్యూహాల‌ను సిద్ధం చేసే బాధ్య‌త‌ల‌ను కూడా జీవీఎల్‌కు అప్ప‌గించార‌ని అంటున్నారు. మొత్తానికి రాష్ట్ర నాయ‌కులే కాకుండా.. పాత‌, కొత్త నేత‌ల క‌ల‌యిక‌తో.. బీజేపీని న‌డిపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి ఈ వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి.