జ‌గ‌న్‌ను కాపాడేసిన చంద్ర‌బాబు.. ఇదే అస‌లు పొలిటిక‌ల్ ట్విస్ట్‌…!

రాజ‌కీయాల్లో కొన్ని కొన్ని చిత్రాలు జరుగుతుంటాయి. దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఆందోళ‌న‌లు.. నిర‌స‌న లు, వ్యాఖ్య‌లు అన్నీ కూడా గాలికి కొట్టుకు పోతూ ఉంటాయి. ఇప్పుడు ఏపీలోనూ ఇదే త‌ర‌హా రాజ‌కీయం న‌డుస్తోంది. ముఖ్యంగా ఈ మారిన రాజ‌కీయం కార‌ణంగా.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఒడ్డున ప‌డిపోయా రు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌నకు తీవ్ర సెగ‌లు.. పొగ‌లు క‌నిపించాయి. “నువ్వు ఇలా చెయ్యి.. నువ్వు అలా చెయ్యి.. కేంద్రం పీక నొక్కు. నీకు గొప్ప అవ‌కాశం వ‌చ్చింది.. జార విడుచుకోకు!“ అని రాజ‌కీయ ఒత్తిళ్లు వ‌చ్చాయి.

ఈ చివ‌రి నుంచి ఆ చివ‌ర‌కు అన్న‌ట్టుగా అన్ని ప‌క్షాల‌దీ అదే మాట‌. “జ‌గ‌న్‌కు ఇది పెద్ద చాన్స్‌. దీనిని వాడుకోవాలి“ అని స్వ‌యంగా చంద్ర‌బాబు కూడా అన్నారు. ఇక‌, మిగిలిన నాయ‌కులు.. మ‌రింత దూకు డు ప్ర‌ద‌ర్శించారు. మొత్తానికి పెద్ద దుమార‌మే రేగింది. ఇదంతా ఎందుకంటే.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల అభ్య‌ర్థి విష‌యంలో మ‌ద్ద‌తు ఇచ్చే అంశంపైనే. కేంద్రంలోని బీజేపీ త‌ర‌పున బ‌రిలో నిలిచిన ద్రౌప‌ది ముర్ముకు మ‌ద్ద‌తిచ్చేందుకు వైసీపీ ఎప్పుడైతే.. రెడీ అయిందో.. ఆ వెంట‌నే ఈ సూచ‌న‌లు, స‌ల‌హాలు తెర‌మీదికి వ‌చ్చాయి.

అయితే.. వీటినేమీ వైసీపీ నాయ‌కులు కానీ,సీఎం జ‌గ‌న్ కానీ ప‌ట్టించుకోలేదు. దీంతో టీడీపీ నాయ‌కులు త‌న సొంత ప‌నుల కోసం.. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి జ‌గ‌న్ మ‌ద్ద‌తిచ్చేశార‌ని.. ఏపీ గురించి గాలికి వ‌దిలేశార‌ని.. వ్యాఖ్యానించారు. ఈ స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా కోసం ప‌ట్టుబ‌ట్టి ఉంటే.. కేంద్రం దిగి వ‌చ్చేద‌ని అన్నా రు. ఇలా.. ఈ విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతుండ‌డంతో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నాటికి(ఈ నెల 18) ఇవి మ‌రింత పెరుగుతాయ‌ని.. వైసీపీకి ఉక్కిరి బిక్కిరి త‌ప్ప‌ద‌ని ప‌రిశీల‌కులు అనుకున్నారు.

అయితే.. ఇక్క‌డే రాజ‌కీయం యూట‌ర్న్ తీసుకుంది. స్వ‌యంగా చంద్ర‌బాబు ఉరుములేని పిడుగు మాదిరి గా.. తాను కూడా ద్రౌప‌దీ ముర్ముకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ పరిణామం.. బీజేపీ క‌న్నా.. ద్రౌప‌ది క‌న్నా.. వైసీపీకి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. `హ‌మ్మ‌య్య‌` అని నాయ‌కులు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకం టే.. నిన్నటి వ‌ర‌కు ఏ విమ‌ర్శ‌లైతే.. జ‌గ‌న్‌ను వైసీపీని చుట్టుముట్టాయో.. ఇప్పుడు అవి ఒక్క‌సారిగా తెర‌మ రుగ‌య్యాయి. ఎక్క‌డా వినిపించ‌డం లేదు. దీంతో జ‌గ‌న్‌..ను చంద్ర‌బాబే ఒడ్డున ప‌డేసిన‌ట్టున్నార‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. జ‌గ‌న్‌ను ఇప్పుడు ఇదే విష‌యంపై నిల‌దీస్తే.. వైసీపీ నుంచి టీడీపీపై ఎదురు దాడి ఖాయం. సో.. ఎలా చూసుకున్నా.. జ‌గ‌న్ సేఫ్‌!!