ఆ డైరెక్టర్ ని నమ్మి మోసపోయిన మెహ్రీన్..ఎంత దారుణం అంటే..?

మెహ్రీన్.. ఈ పంజాబీ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందానికి అందం నటనకి నటన..బాగానే అట్రాక్ట్ చేస్తుంది. నటన పరంగా అమ్మడుని పొగడలేం కానీ..మెహ్రీన్ అందాలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చూసేందుకు చక్కటి రూపం..చూడాగానే అట్రాక్ట్ చేసే నవ్వు..అంతకు మించి ఫిజిక్ తో కుర్రకారుని అల్లాడిస్తుంది. ఫస్ట్ సినిమా కృష్ణగాడి వీరప్రేమ గాధ లో చూడటానికి చబ్బీ గా..క్యూట్ గా ఉన్న ఈ అమ్మడు..ఇప్పుడు మాత్రం బాగా సన్నగా అయిపోయ..మొహం లో కళ తప్పిన్నట్లుంది.

ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన మెహ్రీన్..ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు. సినిమా హిట్టా..ఫట్టా అని ఆలోచించకుండా..వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లింది. కొన్ని ఓకే అనిపించగా..మరికొన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక రీసెంట్ గా నటించిన F3 సినిమా అయితే హిట్ అయ్యింది కానీ, అమ్మడు కు మాతర్మ్ పెద్దగా నటించే స్కోప్ లేకపోయింది. ఏదో వరుణ్ ని బుట్టలో వేసుకునే సీన్స్ తప్పిస్తే అమ్మడు పాత్ర F3 లో నిల్ అనే చెప్పాలి.

పైగా, ఈ సినిమాకి ముందు కూడా అమ్మడు ఖాతాలో చెప్పుకోతగ్గ హిట్లు లేక పోవడంతో..మెహ్రీన్ ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకుంది. సినిమా హిట్ కొడితే మళ్లీ ఫాంలోకి రావచ్చు అని ఆశ పెట్టుకుంది. కానీ, అమ్మడి ఆశలు అన్ని నిరాశగానే మిగిలిపోయాయి. ప్రజెంట్ ఆమె చేతిలో చెప్పుకొతగ్గ సినిమాలు లేవు..వస్తాయనే నమ్మకం కూడా పోయింది. రోజు రోజుకు పెరిగిపోతున్న కుర్ర బ్యూటీ అందాల ముందు..మెహ్రీన్ అందాలు ఆనలేకపోతున్నాయి. మరి చూడాలి అమ్మడు ఎలా ముందుకెళ్తుందో..?