ఎన్టీఆర్ కి ఘోర అవమానం..ఏవయ్యా రాజమౌళి ఏం మాట్లాడవే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన అంటే ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నారు. ఆయన జోలికి వస్తే తాట తీసేస్తారు. ఎన్టీఆర్ ని ఒక మాట అరిచినా ఆయన పడతాడు ఏమో కానీ..ఆయన అభిమానులు మాత్రం అస్సలు తగ్గరు..వాళ్లను ట్రోల్ చేసి..పట్టపగలే చుక్కలు చూయిస్తారు. అంతటి అభిమానం ఆయన అంటే వాళ్లకి. అలాంటి అభిమానులను బాగా హర్ట్ చేశాడు రాజమౌళి. రీసెంట్ గా రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ RRR అనే సినిమాను చేశాడు.

ఈ సినిమా లో ఎన్టీఆర్ తో పాటి..మరో హీరో చరణ్ కూడా ఉన్నాడు. సాధారణంగా ఇద్దరు హీరోలతో సినిమా తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా ఇద్దరు బడా హీరోలతో సినిమా అంటే మాటలు కాదు. ఎన్నో చిక్కులు ఉంటాయి. అవన్ని దాటుకుని జక్కన్న సినిమా తీసాడు. హిట్ కొట్టాడు. బాక్స్ ఆఫిస్ చరిత్ర తిరగరాశాడు. కానీ, ఎన్టీఆర్ అభిమానులను మెప్పించలేకపోయాడు. రాజమౌళి ఎన్టీఆర్ కాంబో అనగానే ఓ రేంజ్ లో ఊహించుకున్న ఫ్యాన్స్ కు జక్కన్న ఊహించని షాక్ ఇచ్చాడు . RRR సినిమాలో చరణ్ నే హైలెట్ చేస్తూ స్క్రీన్ స్పేస్ కూడా ఆయన కే ఎక్కువ ఉంది అని..కేవలం ఎన్టీఆర్ పేరు ని వాడుకుని తక్కువ చేశాడని రాజమౌళిని తిట్టిపోశారు. ట్రోల్స్ చేసారు. బండ బూతులు తిట్టారు.

కానీ, ఇవి జక్కన్న పెద్దగా పట్టించుకోలేదు. ఇక మెల్లగా ఆ ఇష్యూ కూల్ అవుతుందిలే అనుకునే టైంకి. మరో పెద్ద ప్రాబ్లమ్ క్రియేట్ చేశాడు. RRR సక్సెస్ సంధర్భంగా రీసెంట్ గా ముంబై లో ఓ మీట్ ఏర్పాటు చేశారు. మీడియా వాళ్లు సైతం పెద్ద సంఖ్యలో వచ్చారు. అంతా బాగానే ఉండి. బాలీవుడ్ బడా స్టార్స్ సైతం రాజమౌళిని ఆకాశానికి ఎత్తుతు పొగిడేశారు. నువ్వు కత్తి..నువ్వు ఇండియన్ సినిమాకి దొరికిన బంగారం,వజ్రం అంటూ అబ్బో బాగా పొగిడేశారు. అక్కడి వరకు బాగానే ఉంది.

కానీ అక్కడకు వచ్చిన మీడియా వాళ్ళు ఎన్టీఆర్ , రాజమౌళి ముందే చరణ్ ను ఈ షాకింగ్ ప్రశ్న అడిగారు.” సినిమాలో మీరే బాగా హైలెట్ అయ్యారు. మీ పాత్రే బాగా ఎలివేట్ అయ్యిందంటున్నారు జనాలు.. దానికి మీ సమాధానం” అని అడగ్గా చరణ్ ” అలా అని నేను అనుకోవట్లేదు. అది నిజం కాదు కూడా. నేను తారక్ మేమిద్దరం చాలా బాగా చేశాము. తారక్‌తో నా ప్రయాణం బాగా నచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు రాజమౌళి గారికి ధన్యవాదాలు” అని చరణ్‌ సింపుల్ గా కొట్టేశాడు. అయితే, దీని పై తారక్ అభిమానులు హర్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. సినిమాలో తక్కువ చేసామని మేము బాధపడుతుంటే.. మళ్ళీ సక్సెస్ మీట్ అంటూ అంతమంది ముందు తారక్ ని అవమానించేలా చేస్తావా అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఖచ్చితంగా రాజమౌళినే అని చెప్పాలి. ఆయన సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ ముంబై వెళ్లకపోతే ఈ ప్రశ్న ఎదురయ్యేది కాదు అంటూ రాజమౌళిని ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా రీసెంట్ గా జరిగిన ఇష్యూ తో అసలే కోపంగా ఉన్న తారక్ ఫ్యాన్స్ కి పుండు మీద కారం వేసిన్నట్లు అయ్యింది అంటున్నారు నెటిజన్స్.