నితిన్ సినిమాలో హాట్ ఐటెం బాంబ్..ఇక పై దబిడి దిబిడే..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నితిన్ అనే పేరుకు ఓ చరిత్ర ఉంది. దానికి ఓ అర్ధం ఉంది. దిల్ సినిమా తో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన ఈ కుర్రాడు..అప్పట్లో సృష్టించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఒక్కే ఒక్క సినిమా తో తన పేరుని టాప్ హీరోల లిస్ట్ లో చేర్చుకునేశాడు. ఇక ఆ తరువాత మంచి మంచి స్టోరీ లైన్లను చూస్ చేసుకుని..భారీ బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక ఈయనకు తిరుగులేదు.. ఈయన తో సినిమా చేస్తే బంపర్ హిట్ అని నిర్మాతలు నితిన్ సినిమాకి డబ్బులు కుమ్మరించారు. సీన్ కట్ చేస్తే..వరుస హ్యాట్రిక్ ఫ్లాప్ సినిమాలు దక్కించుకున్నాడు. అసలు నితిన్ నేనా ఈ సినిమాలో హీరో అని దారుణంగా కామెంట్స్ వినిపించాయి. అంత చెత్త పేరు మూటకట్టుకుని..మళ్లీ తన తప్పులను తెలుసుకుని..స్టోరీ సెలక్షెన్స్ లో సలహాలు తీసుకుంటూ.. “ఇష్క్” మూవీతో ఫాంలోకి వచ్చాడు.

ఇక ఇప్పుడు ఆయన సినిమాలు బ్లాక్ బస్టర్ కాకపోయినా యావరేజ్ టాక్ ను సంపాదించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓ పొల్టికల్ డ్రామాలో నటించేందుకు సైన్ చేసిన నితిన్.. మాచర్ల నియోజిక వర్గం అనే పేరుని ఫిక్స్ చేసారు. ఈ సినిమాలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ కృతిశెట్టి నటిస్తుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం..బాలీవుడ్ బ్యూటీ ఐటెం బాంబ్ పేరు తెచ్చుకున్న ఊర్వశి రౌతెలా ఫైనల్ అయ్యిన్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే హిందీలో సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ లాంటి చిత్రాలలో నటించి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో నితిన్ పక్కన ఐటెం సాంగ్ లో చిందులు వేస్తే కుర్రాళ్ల గుండెల్లో దబిడి దిబిడే అంటూ యువత ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి దీని పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో..?