వావ్: బాలయ్య సినిమాలో కుర్రబ్యూటి..ఏం అదృష్టం పాప నీది..?

సినిమా ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ పుట్టుకోస్తుంది. వచ్చి రాగానే క్రేజీ ఆఫర్లు పట్టేసి.. కుర్రాళ్ళను తమ అందాలతో కట్టిపడేస్తున్నారు నేటి కాలం కుర్ర బ్యూటీలు. ఆ లిస్ట్ లో కే వస్తారు కన్నడ బ్యూటీ కృతి శెట్టి, బబ్లీ గార్ల్ శ్రీలీల. ఇద్దరిరికి ఇద్దరే ఏ విషయంలోను తీసిపోరు..ఎక్స్ పోజింగ్ చేసి కుర్రాళ్ళ మతులు పోగొట్టడంలో శ్రీలీల ముందు వరుసలో ఉంది. పద్ధతిగా లంగా వోణీ వేసుకుంటూనే..సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది.

ఈ క్రమంలోనే పాపకి మంచి మంచి ఆఫర్లు తలుపుతడుతున్నాయి. పెళ్లి సందD అనే సినిమా తో పిచ్చెక్కించిన ఈ బ్యూటీ ప్రస్తుతం..రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. మన మాస్ మహారాజా సినిమాలో ఈ కుర్ర బ్యూటీ అంటే రచ్చ మామూలూగా ఉండదు. కాగా, ఇప్పటికే మరో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ కు కమిట్ అయిన శ్రీలీల ఖాతాలోకి బిగ్గెస్ట్ భారీ ఆఫర్ వచ్చి పడిన్నట్లు తెలుస్తుంది.


యస్.. సినీ వర్గాల దగ్గరనుండి అందుతున్న సమాచారం మేరకు శ్రీలీల మన బాలయ్య సినిమాలో ఓ కీలక రోల్ కి సెలక్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తరువాత బాలయ్య ..డైనమిక్ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారని ఇప్పటికే టాక్ మొదలైంది. కాగా, #NBK 107 సినిమాలో బాలయ్య కూతురిగా ఈ కుర్ర బ్యూటి కనిపించనుందట. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల ది చిన్న పాత్రేనని..కానీ బాలయ్య లాంటి స్టార్ లెజండ్ పక్కన నటించే ఛాన్స్ రావడంతో అమ్మడు ఈ ప్రాజెక్ట్ ని ఓకె చేసిందని తెలుస్తుంది. కాగా, ఈ సినిమాకి కూడా శ్రీలీల రెమ్యూనరేషన్ ఎక్కువుగానే తీసుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. కెరీర్ స్టార్టింగ్ లోనే బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలో నటించడం అంటే..శ్రీలీల జాతకం తిరిగిపోవడం పక్కా అంటున్నారు సిని విశ్లేషకులు.