RRR వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌.. టార్గెట్ ఎన్ని కోట్లు అంటే…!

భార‌త‌దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఇండియ‌న్ సినిమా అభిమానులు ఆర్ఆర్ఆర్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి ఈ ఒక్క శాంపిల్ చాలు. బుక్ మై షో లో టికెట్స్ ఆలా ఓపెన్ అయ్యాయో లేదో వారం రోజుల పాటు టికెట్స్ అన్ని ఫుల్ అయ్యాయి. ఏపీ, తెలంగాణ‌లో అయితే టిక్కెట్ల కోసం పెద్ద యుద్ధ‌మే న‌డుస్తోంది.

వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున సినిమా రిలీజ్ అవుతుండడం తో సినిమాను చూసేందుకు అభిమానులు , సినీ లవర్స్ అతృతతో ఉన్నారు. ఒక్క ఇండియాలో హిందీ వెర్ష‌న్ మాత్ర‌మే 3400 స్క్రీన్ల‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఓవ‌ర్సీస్‌లో 1100 స్క్రీన్ల‌లో ఈ సినిమాను వ‌దులుతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 451 కోట్ల రూపాయ‌ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఏరియాల వారీగా ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Nizam : 70 కోట్లు
Ceded : 37 కోట్లు
UA: 22 కోట్లు
East: 14 కోట్లు
West: 12 కోట్లు
Guntur: 15 కోట్లు
Krishna: 13 కోట్లు
Nellore: 8 కోట్లు
—————————
AP-TG Total:- 191 కోట్లు
—————————
KA: 41 కోట్లు
Tamilnadu: 35 కోట్లు
Kerala: 9 కోట్లు
Hindi: 92 కోట్లు
ROI: 8 కోట్లు
OS – 75 కోట్లు
——————————————————–
Total WW: 451 కోట్లు (Break Even- 453 కోట్లు + )
——————————————————–