మెగా ఫ్యాన్స్‌ని హర్ట్ చేసిన జక్కన్న..ఏదో తేడా కొడుతుందే..?

వచ్చేసింది..కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. కేవలం మరి కొద్ది గంటల్లోనే ..దేశవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ కాబోతుంది. సినిమా రికార్డులు తిరగరాయలని అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి అభిమానులు కాచుకుని కూర్చున్నారో. సినీ విశ్లేషకుల అంచానా ప్రకారం ఈ సినిమా.. ఖచ్చితంగా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది అంటూ చెప్పేస్తున్నారు. కాగా, మెగా ఫ్యాన్స్ నుండి ఈ సినిమా రెస్పాన్స్ మరోలా ఉంది.

సినిమా ప్రోమోషన్స్ లో భాగంగ చిత్ర డైరెక్టర్ రాజమౌళి..బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో ఓ స్పెషల్ ఇంటర్వ్యుల్లో పాల్గోన్నాడు. ఈ ఇంటర్వ్యుల్లో జక్కన్న తన ఇది వరకు ఇంటర్వ్యుల్లో చెప్పని బోలెడు విషయాలని చెప్పుకొచ్చాడు. అఫ్కోర్స్ సందీప్ కూడా అలాంటి ప్రశ్నలే వేశాడు. కాగా ఈ క్రమంలోనే సినిమాలో హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో ఏమన్నా స్పెషల్ ఐటేం సాంగ్స్ ఉన్నాయా..రొమాంటిక్ సీన్స్ , లవ్ ట్రాక్స్ అంటూ ప్రశ్నించగా..రాజమౌళి తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడు.

“మా సినిమాలో ఎటువంటి ఐటెం సాంగ్ లేదని.. రొమాంటిక్, గ్రిమాంటిక్ సీన్స్ లేదని..రామ్ చరణ్ ఆలియా మధ్య అసలు అలాంటి సీన్స్ ఎక్కడ కనిపించవు అని..మీకు కనిపించే సీన్స్ అంతా కూడా కేవలం చరణ్-తారక్ ల పై మాత్రమే ఉంటాయి”..అంటూ చెప్పుకొచ్చాడు. అయితే , అలియా లాంటి బ్యూటిఫుల్ హీరోయిన్ ని ఈ సినిమాలో పెడుతున్నప్పుడే ఖచ్చింతంగా ఈ సినిమాలో వల్గారిటి రొమాన్స్ లేకపోయినా..హెల్తీ లవ్ సీన్స్ ఉంటాయి..అని మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు రాజమౌళి అలాంటివి ఏం లేవు అంటూ చెప్పడంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. కొంత మంది రాజమౌళి ని తిడుతున్నారు కూడా.. మరి లవ్-రొమాన్స్-హీరోయిన్స్ తో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేని RRR ను మెగా ఫ్యాన్స్‌ ఆదరిస్తారా..? ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే..!!