నాకు డబ్బేఇవ్వలేదు అంటూ ఓపెన్ అప్ అయిన సమంత.. షాకింగ్ పోస్ట్..!!

సమంత..విడాకుల తరువాత సోషల్ మీడియాలో టూ యాక్టీవ్ గా ఉంటుంది. అడిగిన వాటికి అడగనివాటికి ఆన్సర్ చేస్తూ..నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మనకు తెలిసిందే స్టార్ హీరోయిన్ గా ఉన్నటువంటి సమంత..తన భర్త నాగచైతన్య కు విడాకులిచ్చేసి వేరు గా సింగిల్ గా ఉంటుంది. టాలీవుడ్ ది బెస్ట్ రొమాంటిక్ కపుల్ అనిపించుకున్న ఈ జంట విడిపోవడానికి కారణాలు చాలా నే వినిపించాయి. సోషల్ మీడియాలో చాలా దారుణంగా ఆమెను ట్రోల్ చేశారు.

కొందరు అయితే సమంత కి తన పరసనల్ స్టైలిస్ట్ అంటే ప్రీతమ్ జుకల్కర్ తో అఫైర్ ఉందని..అందుకే నాగ చైతన్య సమంత కు విడాకులు ఇచ్చాడని పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. ఇక ఎట్టకేలకు దీని పై రియాక్ట్ అయిన ప్రీతమ్ జుకల్కర్ .. సమంత నాకు అక్క అవుతుందని..మా మధ్య అలాంటి చీప్ సంబంధం అంటకట్టదు అని చెప్పుకొచ్చారు.. కొన్ని రోజులు హాట్ టాపిక్ గా నడిచిన ఈ వ్యవహారం ..ఆ తరువాత సైలెంట్ అయిపోయింది.

కానీ మధ్య మధ్యలో వీళ్ళే లేనిపోని పోస్ట్ లు పెడుతూ..వాళ్ల మధ్య ఏదో సంబంధం ఉంది అనేలా ప్రూవ్ చేసుకుంటున్నారు. తాజాగా మరోసారి అలాంటి పోస్ట్ నే పెట్టింది సమంత. “రీసెంట్ గా తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ కి హెయిర్ కట్ చేసింది సమంత. దానికి సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ. ఇన్స్టా స్టోరీలో పోస్ట్ పెడుతూ..”నేను మల్టీటాలెంటెడ్ అని సమంత ప్రీతమ్ హెయిర్ కట్ చేస్తున్న పిక్ తో పాటు..నువ్వు నాకు ఈ పని చేసినందుకు డబ్బులు ఇవ్వలేదు” అంటూ రాసుకొచ్చింది. దీంతో సమంత పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మీ మధ్య తప్పుడు వార్తలు వస్తున్నప్పుడు దూరంగా ఉండచ్చుగా..ఇలాంటి చెత్తపనులు ఎందుకు సామ్ అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో సమంత వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.