చాలా బాధగా ఉంటుంది..ఒక్కరాత్రిలో ఏమైనా జరగచ్చు.. అసలు మ్యాటర్ బయట పెట్టిన మెహ్రీన్..

సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావడం గొప్ప విషయం కాదు..వచ్చాక కూడా ఆ పేరుని వాళ్ల అభిమానాని అదే స్దాయిలో ఉంచుకోవడం కష్టం. పెరుగుతున్న కాంపీటీషన్ కి, రోజుకో కుర్ర బ్యూటి తెర పై ఎంట్రీ ఇస్తూంటే యువత కొత్త అందాలకు అట్రాక్ట్ అవుతుంటారు. వాళ్లను చూపు తిప్పుకోనీకుండా కట్టిపడేయాలి. హాట్ ఫోటోలతో..ఎప్పటికప్పుడు వాళ్లను ఉత్సాహ పరుస్తుండాలి అప్పుడే హీరోయిన్స్ వాళ్లకి గుర్తుంటారు. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా టచ్ లోనే ఉండాలి.

ఇక మెహ్రీన్ కూడా అలానే చేస్తుంది. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ..మొదటి సినిమాతోనే మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకునేలా చేసుకుంది. అంతే చబ్బీ చీక్స్ ..బబ్బ్లీ లుక్స్ తో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ఇక ఆ తరువాత ముందు వెనుక ఆలోచించకుండా వచ్చినా ఆఫర్స్ అని సైన్ చేసుకుంటూ పోయింది. ఆ ఎఫెక్ట్ తోనే కెరీర్ లో ఫ్లాప్ లు కూడా చూసింది. అలాగే మంచి మంచి హిట్లు కూడా వేసుకుంది. సినిమాల పరంగా మతా బాగుంది అని అనుకుంటున్నప్పుడు.. సీఎం మనవడితో నిశ్చితార్ధం చేసుకుని..షాక్ ఇచ్చింది.

ఎంత త్వరగా పెళ్లి పీఠలు ఎక్కాలి అని అనుకున్నిందో అంతకన్నా త్వరగా బ్రేకప్ అంటూ నిశ్చితార్ధాని రద్దు చేసుకుంది. ఆ తరువాత కూడా మెహ్రీన్ కి సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రజెంట్ చేతిలో నాలుగు సినిమాలు పట్టుకుని ఉన్న ఈ బ్యూటీ రీసెంట్ గా పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నటీ నటులు తమ కుటుంబాని వదిలి దూరంగా ఉండడం ఎంత బాధగా ఉంటూందో తెలియజేసింది. మెహ్రీన్ తన పోస్ట్లో..” సినీ సెలబ్రిటీల లైప్ చిత్రవిచిత్రంగా ఉంటుంది. సినిమా మంచి విజయం అందుకుంది అని అనుకునేలోపే..మళ్ళీ అపజయాల అగాథాల్లోకి కూరుకుపోతాం. అందుకే సినీ ఇందస్ట్రీ లో ఏమైన జరగచ్చు అని అంటారు..ఒక్కరాత్రిలోనే సెలబ్రిటీల జాతకాలు మారిపోతాయి. మేము షూటింగ్‌ కోసం పగలు, రాత్రి తేడా లేకుండా ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా షూటింగ్స్‌ చేయాల్సి ఉంటుంది. టైంకి భోజనం ఉండదు, సరిగ్గ నిద్ర ఉండదు..దీని వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన కుటుంబానికి దూరంగాఉండడం గడపటం చాలా బాధాగా ఉంటుంది. అయినా కానీ సినిమా మనల్ని ప్రపంచంలోకి తీసుకెళ్తుంది’ అని చెప్పుకొచ్చింది మెహరీన్‌.