ఏపీ, తెలంగాణ‌లో RRR టార్గెట్ ఎన్ని కోట్లో తెలిస్తే ఫ్యీజులు ఎగ‌రాల్సిందే..!

భార‌త‌దేశ వ్యాప్తంగా సినీ ల‌వ‌ర్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR. ఈ నెల 25న భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా ఇప్ప‌టికే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎన్నో సంచ‌ల‌న రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రి రిలీజ్ బ‌జ్ ఇలా ఉందంటే ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చెప్ప‌క్క‌ర్లేదు.

ఇక ఈ సినిమాకు ఓవ‌రాల్‌గా రు. 500 కోట్ల బ‌డ్జెట్ అయ్యింది. రు. 1000 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర స్టార్ట్ చేసింది. ఇక ఏపీ , తెలంగాణ‌లో ఈ సినిమా ఏకంగా రు. 190 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే రు. 190 కోట్ల షేర్ కేవ‌లం ఏపీ, తెలంగాణ నుంచి వ‌స్తేనే ఈ సినిమా హిట్ అయిన‌ట్టు అవుతుంది.

అంటే రు. 250 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టాల్సి ఉంటుంది. మ‌రి సినిమాకు ఏ రేంజ్ టాక్ వ‌స్తుంది ? ఇంత పెద్ద భారీ టార్గెట్ త్రిబుల్ ఆర్ ఎలా చేధిస్తుంది ? అన్న‌ది 25న తేలిపోనుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించినందున త్రిబుల్ ఆర్ బుకింగ్స్ జోరందుకున్నాయి.