అమ‌ల కంటే ముందు ఏఎన్నార్ ఆ హీరోయిన్‌తో నాగార్జున పెళ్లి ఫిక్స్ చేశారా..?

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా చరిత్రకు 70 నుంచి 80 సంవత్సరాలు ఉన్నాయి అని అనుకుంటే… దాదాపు అక్కినేని ఫ్యామిలీ చరిత్ర కూడా ఏడు దశాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది. దివంగ‌త లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా వచ్చిన యువసామ్రాట్ నాగార్జున సీనియ‌ర్ హీరోగా ఇప్పటికే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నాగార్జున నట వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ అక్కినేని వంశంలో మూడోతరం హీరోలుగా ఆయన ఇద్ద‌రు త‌న‌యులు హీరోలుగా కొనసాగుతున్నారు. పదేళ్ళ క్రితమే జోష్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య తన తండ్రి స్టైల్ లోనే ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాడు.

ఇక అఖిల్‌ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక నాగార్జున వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీలక్ష్మిని ముందుగా పెళ్లి చేసుకున్నాడు. నాగచైతన్య పుట్టాక వీరి మ‌ధ్య‌ మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తెలుగు – తమిళంలో హీరోయిన్గా కొనసాగుతున్న అమ‌ల‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఒకానొక సందర్భంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా అక్కడ హీరోయిన్లతో ఏఎన్ఆర్ ముచ్చట్లు పెట్టారట.

ఆ సమయంలో సుమలత ఆయన కంటికి అందంగా కనిపించడంతో ఆమెను పిలిచి ఒక అబ్బాయి ఉన్నాడు పెళ్లి చేసుకుంటావా ? అని అడిగారట. ఆ అబ్బాయి ఎవరు సార్ ? అని సుమలత అమాయకంగా అడగగా వెంటనే నా చిన్నబ్బాయి నాగార్జున అమెరికాలో చదువుతున్నాడు.. నువ్వు ఓకే అంటే పెళ్లి చేస్తానని చెప్పడంతో సుమ‌ల‌త‌కు ఒక్కసారిగా భయం వేసిందట. ఏఎన్ఆర్ తనతో ఆ మాట సరదాకు అన్నారా ? లేదా నిజంగా అన్నారో తెలియక తాను డైలమాలో పడిపోయానని సుమలత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అనంతరం సుమలత కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.