ఆ కార‌ణంతోనే నా ల‌వ్ బ్రేక‌ప్ అయ్యింద‌న్న బింధుమాద‌వి…!

బిందు మాధవి.. చిత్తూరు జిల్లా మదనపల్లి కి చెందిన ఈమె తెలుగమ్మాయి అయినప్పటికీ తెలుగులో మంచి మంచి అవకాశాలను కొట్టేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అప్పట్లో సంపాదించుకుంది .. కానీ అవకాశాలు తగ్గిపోవడంతో తెలుగు సినీ ఇండస్ట్రీ ని వదిలి కోలీవుడ్ ఇండస్ట్రీ బాట పట్టింది. అక్కడ ఈ ముద్దుగుమ్మను తమిళ్ ప్రేక్షకులు బాగా ఆదరించారని చెప్పవచ్చు.వరుస సినిమాలు చేసుకుంటూ అక్కడ స్టార్ హీరోయిన్ గా చలామణి అయింది బిందు మాధవి.

అక్కడ బిగ్ బాస్ లో కూడా నటించి నాలుగవ స్థానంలో కూడా నిలిచింది. తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వాలనే కారణంతో ఓ టీ టీ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కంటెస్టెంట్ గా పాల్గొనడం జరిగింది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో చూడడానికి చాలా సైలెంట్ గా.. అమాయకురాలు గా కనిపించేది కేవలం హీరోయిన్ బిందుమాధవి మాత్రమే . ఇక ఈమె సినిమాలలో కూడా అంతే ఇన్నోసెంట్ గా కనిపిస్తూ తన సినిమాలు కూడా చాలా సింపుల్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి.

ఇదిలా ఉండగా బిందుమాధవి తాజాగా తన పర్సనల్ విషయాలను చెప్పాల్సిన టైం వచ్చింది ఈ ఎపిసోడ్లో ఆమె తన వ్యక్తిగత జీవితాల గురించి కూడా వివరించింది. టాక్ లో భాగంగా బిందుమాధవి తన వ్యక్తిగత విషయాల గురించి పర్సనల్ విషయాల గురించి చెప్పవలసి రాగా తన గురించి ఆమె వెల్లడించింది.కాలేజ్ టైంలో ప్రేమించుకున్నామని, అయితే కెరీర్ కోసం దూరమవ్వాల్సి వచ్చిందని, అతను చదువుల కోసం యూఎస్ వెళ్లిపోయాడని, తాను ఇలా సినీ రంగంలోకి వచ్చేశాను అని తెలిపింది.

కానీ ఆ రిలేషన్ మాత్రం తనకు ఎప్పటికీ స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది.అతని పేరుని మాత్రం చెప్పలేను. ఇప్పుడు అతడికి పెళ్లి అయిపోయిందంటూ బిందు మాధవి తెలిపింది. పీకల బిందుమాధవి పర్సనల్ లైఫ్ ముందుకు సాగాలనే లక్ష్యంతోనే ఇద్దరూ తమ ప్రేమను దూరం చేసుకోవాల్సి వచ్చింది అంటూ కొంతవరకు ఎమోషనల్ అయ్యింది బిందుమాధవి.