కొత్త క్యారెక్ట‌ర్‌లో న‌ట‌సింహం… దేవుడిగా బాల‌య్య‌…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌కు పౌరాణిక‌, సాంఘీక‌, చారిత్ర‌క పాత్ర‌లు ఏవైనా అల‌వోక‌గా చేసేస్తారు. నాలుగు ద‌శాబ్దాల న‌ట జీవితంలో తండ్రి ఎన్టీఆర్ వార‌స‌త్వం అందిపుచ్చుకున్న బాల‌య్య‌కు ఏ పాత్ర‌లు అయినా కొట్టిన పిండే. పౌరాణిక పాత్ర‌ల‌తో పాటు భైర‌వ‌ద్వీపం లాంటి జాన‌ప‌ద చిత్రంలోనూ, ఆదిత్య 369 లాంటి వైవిధ్య‌మైన క‌థ‌లోనూ, ఇటు ఫ్యాక్ష‌న్‌, యాక్ష‌న్ సినిమాల‌కు కూడా బాల‌య్య కేరాఫ్‌.

తాజాగా వ‌చ్చిన అఖండ సినిమాతో అయితే ఏకంగా అఘోరాగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసిప‌డేశాడు. ఈ వ‌య‌స్సులో బాల‌య్య అఘోర పాత్ర‌లో న‌టించిన తీరుకు నంద‌మూరి, బాల‌య్య అభిమానులే కాదు.. టోట‌ల్ తెలుగు సినిమా అభిమానులు కూడా ఫిదా అయిపోయారు. అందుకే అఖండ‌కు అంత‌లా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేశారు. ప్ర‌స్తుతం బాల‌య్య మ‌లినేని గోపీచంద్ సినిమా చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పుడు బాల‌య్య మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో చేసేందుకు రెడీ అవుతున్నార‌ట‌. సోషియో ఫాంట‌సీ సినిమాలో దేవుడి పాత్ర‌లో బాల‌య్య న‌టించే ఛాన్సులు ఉన్నాయి. మ‌న‌కు ఈ త‌రం జ‌న‌రేష‌న్లో సోషియో ఫాంట‌సీలో దేవుడి పాత్ర అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గోపాల గోపాల సినిమాయే గుర్తుకు వ‌స్తుంది. ఆ సినిమాలో ప‌వ‌న్ మ‌ఫ్టీలో ఉన్న దేవుడిగా క‌నిపించాడు. ఇప్పుడు బాల‌య్యది కూడా అదే టైప్ రోల్ అని టాక్ ?

పీపుల్స్ మీడియా బాల‌య్య హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో బాల‌య్య మ‌ఫ్టీలో ఉన్న దేవుడిగా క‌నిపించ‌బోతున్నార‌ని టాక్ ? బాల‌య్య ఈ త‌ర‌హా పాత్ర చేయ‌డం ఇదే మొద‌టిసారి అవుతుంది. అయితే ఈ పాత్ర‌కు బాల‌య్య ఇంకా ఎస్ ఆర్ నో అయితే చెప్ప‌లేదు. బాల‌య్య ఓకే అంటే ఆయ‌న్ను మ‌రో కొత్త త‌ర‌హా పాత్ర‌లో మ‌నం చూడ‌బోతున్నాం.