భీమ్లా నాయక్ ట్రైలర్ వచ్చేసింది …ఫ్యాన్స్ కి పూనకాలే

పవర్ స్టార్ ,రానా దగ్గుబాటి లలు హీరోలుగా సితార ఎంటర్టైన్మెంట్ లో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో సూర్య దేవర నాగ వంశి నిర్మాణంలో వస్తున్న సినిమా భీమ్లా నాయక్ .తెలుగు ప్రేక్షకులు ,మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా భీమ్లా .ఈ రోజు ట్రైలర్ లంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా ఆంధ్ర ప్రదేశ్ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకాల మరణంతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాన్సల్ చేసారు చిత్ర బృందం .అయితే థియేట్రికల్ ట్రైలర్ మాత్రం రిలీజ్ చేశారు .ట్రైలర్ మొత్తం పవర్ ఫుల్ ప్యాక్ తో మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెచ్చేటట్టు ఉన్నది ట్రైలర్ .

భీమ్లా నాయక్ సినిమా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ పర్యవేక్షణలో తెరకెక్కించారు .ఇందులో నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించింది .ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు .