భీమ్లా నాయ‌క్ హిట్ అయితే త్రివిక్ర‌మ్‌కే క్రెడిట్‌.. ఫ‌ట్ అయితే సాగ‌ర్ ఖాతాలోకే…!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే ఆ సినిమా ద‌ర్శ‌కుడికి రిలీజ్‌కు ముందు ఎంత ప్ర‌యార్టీ ఉంటుంది. ప‌వ‌న్ సినిమా డైరెక్ట‌ర్ హంగామా ఉండాలి.. ఎక్క‌డ చూసినా అత‌డే ఉండాలి.. అత‌డి ఇంట‌ర్వ్యూలు, స్పీచ్‌లే వైర‌ల్ అవ్వాలి. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో పాటు ద‌గ్గుబాటి రానా న‌టించిన భీమ్లానాయ‌క్ మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. అయితే ఆ సినిమా ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర క‌న‌ప‌డ‌డం లేదు. ఎక్క‌డ చూసినా త్రివిక్ర‌మ్ హంగామానే న‌డుస్తోంది.

ఏ సినిమాకు అయినా రిలీజ్ కు ముందు నిర్మాత‌, ద‌ర్శ‌కుడు మీడియాతో మాట్లాడ‌డం, హీరోలు మీట్‌లు పెట్ట‌డం కామ‌న్‌గా జ‌రిగే ప్ర‌క్రియ. ఆర్ ఆర్ ఆర్ లాంటి పెద్ద సినిమాకు కూడా అదే ప్రాసెస్‌లో ప్ర‌చారం చేశారు. అయితే ఇప్పుడు భీమ్లానాయ‌క్ విష‌యంలో అంతా రివ‌ర్స్‌లో జ‌రుగుతోంది. ప‌వ‌న్ ఎప్పుడూ మీడియా ముందుకు రారు. ఇక్క‌డ ద‌ర్శ‌కుడిగా టైటిల్ కార్డు మాత్ర‌మే సాగ‌ర్‌ది వేస్తున్నారు.

కానీ తెర‌వెనక క‌థంతా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ న‌డిపిస్తున్నాడు. కథ, స్క్రీన్ ప్లే, క్వాలిటీ చెకింగ్ అంతా త్రివిక్ర‌మ్ క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తోంది. నిజానికి ఈ సినిమాకు మీడియా ముందుకు పెద్ద‌గా ఎవ్వ‌రూ రావ‌డం లేదు.. ఆ ఛాన్స్ తీసుకుని ముందుకు వ‌స్తే సాగ‌ర్‌కు మంచి పేరు ఉంటుంది. సినిమాకు కావాల్సినంత ప్ర‌మోష‌న్‌తో పాటు సాగ‌ర్ హైలెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడెప్పుడో చిన్న సినిమా చేసిన సాగ‌ర్‌కు ఇన్నాళ్ల‌కు మంచి ఛాన్స్ వ‌చ్చింది.

క‌నీసం ఈ సినిమాను తాను చేశాన‌ని ఆయ‌న హ‌డావిడి చేసుకోవాలి. కానీ సాగ‌ర్‌ను బాగా కంట్రోల్ చేస్తున్న‌ట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల భోగ‌ట్టా ? మరో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా హిట్ అయితే అంతా త్రివిక్ర‌మ్ టాలెంట్ అనేందుకు త్రివిక్ర‌మ్‌తో పాటు ఆయ‌న గ్యాంగ్ కాచుకునే ఉంది. హిట్ అయితే సాగ‌ర్‌కు చిన్న వాటా కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఏమాత్రం తేడా కొట్టినా అది సాగ‌ర్ ఖాతాలోకి తోసేసేందుకు రెడీగానే ఉన్నార‌ట‌.