ఆ హీరో కోసం హద్దులు దాటేస్తున్న కీర్తి..ఫస్ట్ టైం లిప్ లాక్ ..?

జనాలు చూస్తున్నారు అని డైరెక్టర్స్ సినిమాలో బోల్డ్ సీన్స్ పెడుతున్నారో..లేకపోతే అలాంటి సీన్స్ ఉంటేనే సినిమాకి హైప్ వస్తుందని భావిస్తున్నారో తెలియదు కానీ..ప్రజెంట్ మనం చూస్తున్న ప్రతి సినిమాలో రొమాన్స్ ఉండాలసిందే . రొమాన్స్ అంటే అలాంటి ఇలాంటి రొమాన్స్ కాదు..బట్టలు ఉన్నాయా లేవా అని అనిపించేలా బట్టలు వేసుకుని.. మేం ఏం తప్పు చేయట్లేదే అంటూనే తప్పుడు పనులు చేస్తూ..ఫైనల్ గా మాకు ఏం సంబంధం లేదు అంతా డైరెక్టర్ చెప్పిన్నట్లే చేశాం అంటూ చేతులు దులిపేసుకుంటున్నారు నేటి కాలం కొందరు హీరో, హీరోయిన్ లు.

ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాలో లిప్ లాస్ సీన్స్ కామన్ అయిపోయాయి. సినిమాలో అవసరం లేకున్నా ఆ సీన్ ను యాడ్ చేసి మరి..ట్రైలర్ లో హైలెట్ గా చూపిస్తూ..సినిమాకి మరింత హైప్ తీసుకొస్తున్నారు మూవీ మేకర్స్. మొన్న ఆ మధ్య వచ్చిన శ్యాం సింగరాయ్ లో కృతి ఎలా రెచ్చిపోయి నాని తో బెడ్ సీన్స్ చేసిందో మనం చూసిన విషయమే. ఇక నిన్న వచ్చిన ఖిలాడి మూవీలో ను అంతే..ముద్దు సీన్స్ ఇంత రోత గా ఉంటాయా అనేలా తెరకెక్కించారు రమేష్ వర్మ. ఇక రీసెంట్ గా వచ్చిన డీ జే టిల్లు లో కూడా లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి.

కొత్తగా వచ్చిన హీరోయిన్స్ నే లిప్ లాక్ సీన్స్ లో నటిస్తున్నారు..మనం ఏం తక్కువ అనుకున్నారు ఏమో తెలియదు కానీ..సీనియర్ హీరోయిన్ లు కూడా అలాంటి సీన్స్ లో నటించడానికి సై అంటున్నారు. నిన్న మొన్నటి వరకు చక్కగా పద్ధతిగా కనిపించిన కీర్తి సురేష్ కూడా ఇలాంటి లిప్ లాక్ సీన్స్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు తెలుస్తుంది. ఆమె నాని సరసన దసరా అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నానితో అమ్మడు హాట్ లిప్ లాక్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంత వరకు హద్దులు దాటని కీర్తి నాని కోసం ఆ హద్దులు చెరిపేస్తున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి నాని కీర్తి రొమాన్స్ తెర పై ఏమాతం పండుతుందో..?