ధనుష్, ఐశ్వర్య 18 ఏండ్ల వివాహ బంధం ఎందుకు తెగింది?

సినిమా పరిశ్రమలో ప్రేమలు, డేటింగులు, పెళ్లిళ్లు, విడాకులు అత్యంత కామన్. ఇవి ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం. నచ్చితే ప్రేమించుకుంటారు.. ఇంకా నచ్చితే డేటింగ్ చేస్తారు. మరికొందరు పెళ్లి చేసుకుంటారు. ఇంకొందరు నచ్చక విడిపోతారు. సినిమా పరిశ్రమ అనే రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. వెండి తెర వెనుక ఉన్న చీకటి కోణాలు అనేకం. వాస్తవానికి సినిమా పరిశ్రమ చాలా లగ్జరీగా కనిపించినా.. దాని వెనుక ఎన్నో అగాథాలున్నాయి. సినిమా రంగం అనే కాదు. ప్రస్తుతం దేశంలోనే విడాకుల కేసులు బాగా పెరిగిపోయాయి. ఏండ్ల పాటు కాపురం చేసిన వారు, పిల్లలు ఉన్నవారు కూడా విడిపోతున్నారు. కలిసి ఉండి కొట్లాడుకోవడం కంటే విడిపోయి సంతోషంగా ఉండటం మంచిదనుకుంటున్నారు. ప్రస్తుత జనరేషన్ లో అడ్జెస్ట్ మెంట్ అనేది లేకుండా పోయింది. అయితే కొన్ని విడాకుల ఘటనలు మాత్రం చాలా షాక్ కి గురి చేస్తున్నాయి.

తాజాగా సంచలనం కలిగించిన ఘటన తమిళ స్టార్ హీరో ధనుష్ విడాకుల కేసు. 18 ఏండ్ల వైవాహిక జీవితం తర్వాత తన భార్య ఐశ్వర్యతో విడిపోతున్నట్లు ఆయన ప్రకటించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. తన భార్యతో విడిపోతున్నట్లు ఆయన నేరుగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఎలాంటి గాసిన్స్, ఊహాగానాలకు తావు లేకుండా తనే స్వయంగా చెప్పాడు. మేం విడిపోతున్నాం.. ఇకపై ఎవరి జీవితం వారిది అని చెప్పాడు. ఒక్కసారిగా ఆయన నుంచి వచ్చిన ఈ ప్రకటన తమిళ సినిమా పరిశ్రమతో పాటు యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది.

వాస్తవానికి వీరి మధ్య గ్యాప్ ఉన్నట్లు ఎప్పుడూ కనిపించలేదు. ఇద్దరిదీ మంచి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్. సంపన్న కుటుంబాలు, ధనుష్ తండ్రి ప్రముఖ నిర్మాత, ఐశ్వర్య తండ్రి సూపర్ స్టార్ రజనీకాంత్. ఇద్దరూ నెమ్మదస్తులు. యంగ్ ఏజ్ లోనే ఐశ్వర్య, ధనుష్ పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు కూడా. పిల్లలు కూడా పెద్దవారు అయ్యారు. అలాంటి వారి నుంచి హఠాత్తుగా విడడాకుల ప్రకటన రావడం ఆశ్చర్యం కలిగించింది. అయితే వారి విడాకులకు కారణం ఏంటనేది వారు చెప్పరు. ఎవరికి తోచినట్లు వారు చెప్పుకోవడం తప్ప.