కమల్ కు షాక్ ఇచ్చిన శృతి హాసన్.. పెళ్లి గురించి ఏముందో తెలుసా?

విలక్షణ నటుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న కమల్ హాసన్ నట వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. శృతిహాసన్ అనగనగా ఒకదీరుడు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు.. మొదటి సినిమానే బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. కానీ మొదటి సినిమా లోనె శృతి హాసన్ తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ఇంకేముంది ఈ అమ్మడి అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఆఫర్లు కూడా రావడం మొదలైంది. ఆ తర్వాత కాలంలో ఓ మై ఫ్రెండ్, గబ్బర్సింగ్, బలుపు, రేసుగుర్రం, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇలా ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది శృతిహాసన్. ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే మైకేల్ కోర్సలే అనే ఇటాలియన్ సింగర్ తో ప్రేమలో పడిపోయింది. కొన్నాళ్ళ వరకు ప్రేమలో మునిగి తేలింది శృతిహాసన్. తర్వాత బ్రేకప్ అయిపోయింది. అంతేకాదండోయ్ మ్యూజిక్ మీదా ఆసక్తితో సినిమాలకు కూడా దూరం అయింది. కానీ ఇటీవల క్రాక్ సినిమాతో ఎంట్రీ ఈ ముద్దుగుమ్మ మళ్లీ వరుస అవకాశాలు అందుకోవడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ చేస్తోంది. ఇక ఇటీవలే డుడుల్ ఆర్టిస్ట్ శాంతను తో ప్రేమలో పడింది శృతిహాసన్. ఇక వీరికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ గా మారిపోయాయి.

ఇకపోతే ఇటీవలే శృతిహాసన్ పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రం తెగ వైరల్ గా మారిపోయాయ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతనూ గురించి పలు విషయాలను షేర్ చేసుకుంది. ఇంతలో మీ పెళ్ళెప్పుడు అంటూ ప్రశ్నించగా.. సమాధానం చెప్పింది ఈ అమ్మడు. తన వద్దకు మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని తనకు అది అస్సలు ఇష్టం లేదు అంటూ చెప్పుకొచ్చింది. లివింగ్ రిలేషన్షిప్ బాగుంది అంటూ మనసులో మాట బయటపెట్టి ఓపెన్ అయింది ఈ ముద్దుగుమ్మ. శృతిహాసన్ సమాధానంతో షాకైన అభిమానులు పాపం తన కూతురు పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడో కమల్.. ఇలాంటి కామెంట్స్ చేసి శృతిహాసన్ తండ్రికి షాక్ ఇచ్చినట్లే ఉంది అని కామెంట్లు పెడుతున్నారు ఎంతమంది.