తన విడాకులపై క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ హిమజ..

బిగ్ బాస్ బ్యూటీ హిమజ తాజాగా వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో విడాకుల కాలం నడుస్తున్న నేపథ్యంలో తను కూడా వివాహ బంధానికి వీడ్కోలు పలకుతుంది అనే వార్తలు జోరుగా వినిపించాయి. అందుకు కారణం కూడా ఉందనే టాక్ నడిచింది. భార్తా భార్యలు ఇద్దరూ ఇన్ స్టాలో అన్ ఫాలో చేసుకోవడమే ఇందుకు కారణం అనే రూమర్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో ఈ పుకారు బాగా వైరల్ అయ్యింది. హిమజకు రెండు సార్లు పెళ్లైందని, ఇప్పుడు మళ్లీ విడాకులకు రెడీ అయ్యిందని వార్తలు వచ్చాయి. అందుకే తన భర్త విజయ్ రెడ్డిని ఇన్ స్టాలో అన్ ఫాలో చేసిందని.. తను కూడా హిమజను అన్ ఫాలో చేశాడనే వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై తాజాగా హిమజ స్పందించింది.

వాస్తవానికి హిమజకు విజయ్కంటే ముందే 2012లో రాజేష్ ఆనందన్ అనే బిజినెస్ మ్యాన్ తో పెళ్లి అయ్యిందట. తనంతరం తను విజయ్ చల్లా రెడ్డిని రెండో పెళ్లి చేసుకుందట. తనకు కూడా ఇది రెండో పెళ్లట. తాజాగా ఈయనకు కూడా హిమజ విడాకులు ఇస్తుందని.. వీరిద్దరి వివాహ బంధానికి త్వరలోనే ఫుల్ స్టాప్ పడుతుందని పలు వార్తా చానెళ్లు, సైట్లు రాసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో తన విడాకుల గురించి బిగ్ బాస్ బ్యూటీ పలు విషయాలను వెల్లడించింది.

తన పెళ్లి, విడాకుల గురించి వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవం అని చెప్పింది. అవన్నీ ఫేక్ న్యూస్ అని వెల్లడించింది. తనకు మరో మూడు సంవత్సరాల వరకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది. తను వాస్తవానికి ఇలాంటి వార్తలను పట్టించుకోనని చెప్పింది. అయితే తన ఇంట్లో వాళ్లు ఇబ్బంది పడకూడదనే ఈ వివరణ ఇస్తున్నట్లు చెప్పింది. ఎట్టకేలకు తన విడాకుల గురించి జనాలకు పలు విషయాలను వెల్లడించింది హిమజ. అటు ఇప్పటికే బుల్లి తెరతో పాటు పలు సినిమాల్లోనూ ఈ అమ్మడు కనిపించింది.