దివంగత నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `పాండురంగ మహత్యం` సినిమాతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన విజయ నిర్మల.. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. మరోవైపు డైరెక్టర్గా మారి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది.
నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సినీ రంగం పై తనదైన ముద్ర వేసిన విజయ నిర్మల.. కృష్ణకు రెండో భార్య అన్న విషయం అందరికీ తెలుసుకు. కానీ, కృష్ణ కూడా విజయ నిర్మలకు రెండో భర్తే. నిజానికి కృష్ణ కంటే ముందు విజయ నిర్మల మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అతడి పేరు కృష్ణమూర్తి. ఆయన షిప్ డిజైనింగ్ ఇంజనీర్ గా పనిచేసేవారు.
విజయ నిర్మల – కృష్ణమూర్తి దంపతులకు ఒక కొడుకు కూడా జన్మించారు. ఆయన ఎవరో కాదు ప్రముఖ నటుడు నరేష్. అయితే వీరి దాంపత్య జీవితం సాఫల్యంగా సాగుతున్న సమయంలో సినిమాలకు సంబంధించి తరచూ గొడవలు అవుతూ ఉండేవట. విజయనిర్మలకు స్టార్ హీరోయిన్గా ఎదగాలనే కోరిక బలంగా ఉండేదట.
కానీ, అది కృష్ణమూర్తికి అస్సలు నచ్చేది కాదట. ఆ కారణంగానే తరచూ గొడవలు పడి.. చివరకు విడాకులు తీసుకున్నారట. మొదటి భర్తతో విడిపోయిన కొన్నాళ్లకు విజయ నిర్మాత కృష్ణను వివాహం చేసుకుంది. ఇక జూన్ 27 2019న ఆమె గుండె పోటుతో మరణించి కుటుంబసభ్యులను, సినీ పరిశ్రమను శోకసంద్రంలోకి నెట్టేశారు.