కాజల్ అగర్వాల్.. పరిచయం అవసరం లేని పేరు. `లక్ష్మీ కల్యాణం` చిత్రంతో తెలుగు సినీ పరశ్రమలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుని స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోయింది. టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసనా ఆడి పాడిన కాజల్.. తమిళ భాషలోనూ నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది.
దశాబ్దం నుంచీ సౌత్ ప్రేక్షకులను తనదైన అందం, అభినయం, నటనతో అలరించిన ఈ పంచదార బొమ్మ.. గత ఏడాది ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూతో ఏడడుగులు నడిచి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ముంబై నగరంలోని తాజ్ ప్యాలెస్ స్టార్ హోటల్లో వీరి వివాహం అంగ రంగ వైభవంగా జరిగింది.
పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తున్న కాజల్‌ను ఓ డైరెక్టర్ ఘోరంగా అవమానించాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. తేజ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీ కళ్యాణం సినిమా షూటింగ్ సమయంలో ఒక ఎమోషనల్ సీన్ చెబుతూ ఏడవలసి వచ్చింది. అయితే చిన్నప్పటి నుంచి ఏడుపు అంటే ఏంటో తెలియని కాజల్ అగర్వాల్ ఒక్కసారిగా ఏడుపు సీన్లలో నటించడం రాలేదట.
దీంతో ఆగ్రహం చెందిన డైరెక్టర్ తేజ సెట్స్‌లో అందరి ముందు కాజల్‌ను తిట్టేసి ఘోరంగా అవమానించారట. అందరి ముందూ తిట్టడాన్ని సహించలేకపోయిన కాజల్ తీవ్రంగా ఏడ్చిందట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన కాజల్.. తేజగారు నన్ను అవమానించినప్పటికీ.. ఆయన నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని తెలియజేసింది.