గత మూడేళ్ల నుంచీ ప్రేమాయణం నడిపిస్తున్న బాలీవుడ్ బ్యూటీఫుల్ జోడీ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లు ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. రాజస్థాన్‌లో సవాయ్ మాధోపూర్ జిల్లా చౌత్ కా బర్వారా పట్టణంలోని రిసార్ట్‌గా మారిన 700 ఏళ్ల నాటి వారసత్వ ప్రదేశం సిక్స్ సెన్సెస్ లో డిసెంబర్ 9న కత్రినా-విక్కీల వివాహం అంగ రంగ వైభవంగా జరగబోతోంది.
ఇప్పటికే ఈ జంట వివాహ వేడుకల కోసం ముంబై నుంచి రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఈ రోజు నుంచే ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు స్టార్ట్ అయ్యాయి. కొద్ది మంది బంధుమిత్రులు, సన్నిహిత సినీ సెలబ్రిటీలు మాత్రమే వీరి విహానికి హాజరు కానున్నారు. ఇక పెళ్లి తర్వాత కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌లు ఫ్యామిలీతో కాకుండా విడిగా ఉండబోతున్నారట.
అందు కోసం ఇప్పటికే జుహూలో ఓ ఖరీదైన మరియు విలాసవంతమైన అపార్ట్మెంట్ లోని 8వ ఫ్లోర్‌ను విక్కీ అద్దెకు తీసుకున్నాడట. ఇక ఆ ఇంటి అద్దె నెలకు రూ. 8 లక్షలట. జులై 2021 నుంచి 5 సంవత్సరాల కాలానికి గానూ ఆ ఇంటిని విక్కీ అద్దెకు తీసుకున్నారట. ప్రారంభ 36 నెలల అద్దె నెలకు రూ.8 లక్షలు అయితే.. తదుపరి 12 నెలల అద్దె నెలకు రూ.8.40 లక్షలు, మిగిలిన 12 నెలల అద్దె నెలకు రూ.8.82 లక్షలు చప్పున చెల్లిస్తారట.
వివాహం అయిన వెంటనే కత్రినా-విక్కీలు కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయబోతున్నారు. ఇక మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. కత్రినా-విక్కీలు ఉండబోయే అపార్ట్మెంట్ లోని 2న ఫ్లోర్‌లోనే ప్రముఖ క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మలు కాపురం ఉంటున్నారు.