టాలీవుడ్లో కమెడియన్‌గా దూసుకుపోతున్న తరుణంలో సునీల్ హీరోగా మారి చేసిన చిత్రమే `అందాల రాముడు`. పి. లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివంగత నటి ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఎన్.వి. ప్రసాద్, పరస్ జైన్, ఆర్. బి. చౌదరిలు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2006లో విడుదలైన సంచలన విజయాన్ని నమోదు చేసింది.
సునీల్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారిన ఈ చిత్రం అప్పట్లోనే ఏకంగా రూ. 12 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాలో సునీల్ తనదైన కామెడీ, ఎమోషన్స్, డాన్సులతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అయితే ఈ బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించడం వెనక పెద్ద కథే నడిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1996లో లివింగ్ స్టన్, రంభ జంటగా వచ్చిన సుందర పురుషన్ సినిమాకు రీమేక్‌గా అందాల రాముడును రూపొందించారు.
అయితే దర్శక, నిర్మాతలు మొదట ఈ రీమేక్ చిత్రంలో హీరోగా సీనియర్ నటుడు బ్రహ్మాజీని అనుకున్నారట. ఈ నేపథ్యంలోనే బ్రహ్మాజీని సంప్రదించగా.. ఆయన నో చెప్పాడట. `సింధూరం` వంటి సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్న సమయంలో కామెడీ సినిమా చేయడం ఇష్టంలేక అందాల రాముడును రిజెక్ట్ చేశారట.
దాంతో సైలెంట్ అయిన దర్శక నిర్మాతలు.. మళ్లీ పదేళ్ల తర్వాత సునీల్‌ను హీరోగా తీసుకుని సినిమాను తెరకెక్కించారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసి.. సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది.