పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాధా కృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధే శ్యామ్`. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇటలీలో జరిగే రొమాంటిక్ బ్యూటిఫుల్ ప్రేమ కథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ మరియు ప్రసీదాలు నిర్మాతలుగా వ్యవహరించారు.
షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. కొన్ని పోస్టర్స్, ప్రభాస్ క్యారెక్టర్‌కు సంబంధించిన టీజర్, సాంగ్స్ ఇలా ఒక్కో అప్డేట్‌ను వదులుతూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాధే శ్యామ్ ట్రైలర్‌కి డేట్ లాక్ చేశారు.
ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్ కటింగ్ పూర్తి అవ్వగా.. డిసెంబర్ 17న గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన సైతం రానుందని సమాచారం. మరి ఇదే నిజమైతే.. డిసెంబర్ 17న రాధేశ్యామ్ ట్రైలర్ రికార్డులను బద్దలు కొడ్డటం ఖాయమని అంటున్నారు నెటిజన్లు.
కాగా, 70ల కాలం నాటి ప్రేమకథగా తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే కనిపించబోతోంది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీలో మిథూన్, మనన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు.