బాల‌య్య సూటి ప్ర‌శ్న‌లు..జ‌క్క‌న్న‌కు చెమ‌ట‌లు..ప్రోమో చూడాల్సిందే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి వ్యాఖ్యాత‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్ర‌సారం అవుతుండ‌గా.. బాల‌య్య త‌న‌దైన హోస్టింగ్‌తో అటు గెస్టుల‌ను, ఇటు ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. ఇక ఇప్ప‌టికే ఈ షో నాలుగు ఎపిసోడ్లు పూర్తి చేసుకోగా కాగా.. ఐదో ఎపిసోడ్ త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కాబోతోంది.

- Advertisement -

ఈ ఎపిసోడ్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, సంగీత ద‌ర్శ‌కుడు కీరవాణి గెస్ట్‌లు వ‌చ్చి బాల‌య్యతో సంద‌డి చేశారు. తాజాగా ఆహా టీమ్ ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుద‌ల చేసింది. అయితే ఈ ప్రోమోలో బాల‌య్య `మీరు ఆల్రెడీ ఇంటెలిజెంట్ అని, అఛీవర్ అని అందరికీ తెలుసు. మరి ఈ ఇంకా ఈ తెల్ల గడ్డం ఎందుకు? అని ప్రశ్నించారు.

అలానే `ఇప్పటి వరకు మన కాంబినేషన్ లో సినిమా పడలేదు.. నా అభిమానులు “బాలయ్య తో సినిమా ఎప్పుడు?` అని మిమ్మ‌ల్ని అడిగారు.. దీనికి మీ సమాధానం ఏంటి?` అని మ‌రో ప్ర‌శ్న సంధించిన బాల‌య్య‌.. చివ‌రిగా `మీతో సినిమాలు చేసిన హీరోలకు ఇండస్ట్రీకి హిట్ ఇస్తారు.. ఆ తర్వాత వారి రెండు మూడు సినిమాలు ఫసక్కేగా..?` అని వ్యంగ్యంగా అడిగారు.

అయితే అన్ని ప్ర‌శ్న‌ల‌కు జ‌క్క‌న్న కేవలం హావభావాలు మాత్రమే పలికించారు. దీంతో `సమాధానాలు చెప్పరేంటి రాజమౌళి` అని బాల‌య్య అన‌గా.. `మీకూ తెలుసు, నాకూ తెలుసు ఇది ప్రోమో అని, సమాధానాలు ఎపిసోడ్‌లో చెబుతా` అని రాజ‌మౌళి రిప్లై ఇచ్చాడు. మొత్తానికి ప్రోమో బ‌ట్టీ చూస్తుంటే.. బాల‌య్య సూటి ప్ర‌శ్న‌ల‌తో జ‌క్క‌న్న‌కు గ‌ట్టిగానే చెమ‌ట‌లు ప‌ట్టించిన‌ట్టు అర్థ‌మైంది. మ‌రి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రోమోపై మీరూ ఓ లుక్కేసేయండి.

Share post:

Popular