టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటించగా.. మళయాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతున్నారు. అనసూయ, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` లుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో డిసెంబర్ 17న విడుదల కాబోతోంది. విడుదలకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉండడంతో సినిమా ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే.. పుష్ప తాజాగా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని యూ / ఏ సర్టిఫికెట్‌ను దక్కించుకుంది.
అయితే ఈ సినిమాకు సెన్సీర్ వారు గట్టిగానే కోతలు వేశారట. పుష్పలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉండటంతో దర్శకుడు సుకుమార్ కొన్ని బోల్డ్ డైలాగులు, వయొలెన్స్‌తో కూడిన సన్నివేశాలను చిత్రీకరించాడట. అయితే వాటిల్లో కొన్ని సన్నివేశాలు సెన్సార్ కత్తెరకు గురయ్యాయి. పుష్ఫ సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలకి కోత వేసిన సెన్సార్.. పలు అభ్యంతరకర సంభాషణల దగ్గర మ్యూట్ చేయాలని సూచించారు. మరి పుష్ప సినిమాలో ఏయే సీన్లే సెన్సార్ కత్తెరకు వెళ్లాయి..?మ్యూట్ అయిన డైలాగులు ఏంటీ..? వంటి ఇప్పుడు తెలుసుకుందాం.
-ఆల్కహాల్ స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం. ఇది ప్రతి సినిమాలోనూ వేసేదే. సినిమాలో అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు ఆ వార్నింగ్ తో కూడిన టెక్స్ట్ డిస్ ప్లే చేస్తూ కొన్ని మధ్యం బ్రాండ్స్ ను బ్లర్ చేయాలి.
-‘లం*’, ‘లం* కొ*కా’, `వంటి డైలాగ్స్ వచ్చినప్పుడు మ్యూట్ చేయాలి.
-కొన్ని వియోలెన్స్ సన్నివేశాల్లో రక్తం ఎక్కువగా కనిపించకుండా బ్లర్ చేయాలి.
– ఓ సన్నివేశాల్లో `ముం*` అనే డైలాగ్ వచ్చినప్పుడు మ్యూట్ వేయడం
– ఓ సన్నివేశంలో ఒకరి చెయ్యి కట్ అయ్యే సన్నివేశాన్ని బ్లర్ చేయాలి.
#PushpaTheRise Censor Certificate
Censored U/A with 179.51mins runtime (2hrs 59 mins 51 sec)#Pushpa #PushpaTheRiseOnDec17 #AlluArjun #RashmikaMandanna pic.twitter.com/KXHZoH5gC0— TrackTollywood (@TrackTwood) December 13, 2021