ఓటీటీ వైపు చూస్తున్న `శ్యామ్ సింగ‌రాయ్‌`..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 24న విడుద‌లై సూప‌ర్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ క్ర‌మంలోనే ఫ‌స్ట్ వీకెండ్‌ మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. రెండో వారం వీక్ అయిపోయింది. ఏపీలో సినిమా టికెట్ రేట్ల‌పై నాని వ్యాఖ్యలు, ఏపీ మంత్రుల మాటల దాడి అంశాలు వివాదాస్పదంగా మారాయి. ఈ ప్ర‌భావం శ్యామ్ సింగ‌రాయ్ క‌లెక్ష‌న్స్‌పై గ‌ట్టిగానే ప‌డింది. ఇలాంటి త‌రుణంలో ఓ ఇంట్ర‌స్టింగ్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. శ్యామ్ సింగరాయ్ ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధం అవుతుంద‌ట‌. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధ‌ర శ్యామ్ సింగరాయ్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను కొనుగోలు చేసింద‌ట‌. ఇక వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. సంక్రాంతికి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ప్లిక్స్ వారు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే. కాగా, నాని ప్ర‌స్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో `అంటే సుందరానికీ` అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ఇటీవ‌ల `ద‌స‌రా` అనే మ‌రో చిత్రాన్ని సైతం ప్ర‌క‌టించాడు. తెలంగాణ నేపథ్యంలో రూపుదిద్దుకోబోయే ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..శ్రీకాంత్ ఓదెల దర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు.

 

Share post:

Popular