బిగ్‌బాస్.. ఎక్కడో హాలీవుడ్లో స్టార్ట్ అయిన ఈ షో తెలుగులోనూ భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇప్పటి వరకు తెలుగులో సక్సెస్ ఫుల్ ఐదు సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్ షో.. అతి త్వరలోనే ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ విషయాన్ని ఇటీవల డిస్నీ హాట్‌స్టార్ యాజమాన్యంతోపాటు నటుడు నాగార్జున ప్రకటించారు.
ఓ గంట మాత్రమే కాదు.. ఓటీటీలో 24X7 ఈ షో అలరించబోతోంది. ఈ ఓటీటీ బిగ్‌బాస్‌కి కూడా నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే షో నిర్వాహకులు కంటెస్టెంట్స్‌ను ఫైనల్ చేశారట. అయితే తాజాగా ఓటీటీ బిగ్‌బాస్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ నుంచి కొన్ని పేర్లు లీక్ అయ్యాయి.
దాని ప్రకారం.. జబర్దస్త్ యాంకర్ వర్షిణి ఈ షోలో పాల్గొనబోతోందట. అలాగే స్టార్ యూట్యూబర్, సాఫ్ట్ వేర్ డెవలపర్స్ వెబ్స్ సిరీస్ లో హీరోయిన్గా నటించిన వైష్ణవి చైతన్యకు ఓటీటీ బిగ్‌బాస్ నుంచి ఆఫర్ అందుకుందట. యూట్యూబ్ ద్వారా సూపర్ పాపులర్ అయిన యాంకర్ శివ మరియు ఢీ 10 విన్నర్ రాజు కూడా ఈ షోలో పాల్గొనబోతున్నారట.
వీరితో పాటుగా 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ హీరోయిన్ అనన్య సైతం ఓటీటీ బిగ్‌బాస్‌లో కనిపించబోతోందని టాక్. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.