టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీగా ‘ఆర్ఆర్ఆర్’ ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు మరోసారి స్టార్ డైరెక్టర్ రాజమౌళి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఇవాళ ఉదయం రిలీజ్ చేయడంతో యావత్ సినీ లవర్స్ ఈ ట్రైలర్‌కు సలాం కొడుతున్నారు. జక్కన్న విజన్‌కు వారు ఫిదా అయిపోయారు. ఆయన ఈ కథను ఎలా మలిచాడా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఇక ఈ సినిమా ట్రైలర్లో మనకు తారక్ కొమురం భీం, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపిస్తున్నారు. అయితే ఈ ట్రైలర్లో ఇద్దరినీ సమానంగా చూపించిన జక్కన్న వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయో మనకు తెలిపే ప్రయత్నం చేశాడు. కాగా కొందరు క్రిటిక్స్ మాత్రం ఈ సినిమాలో ఒక హీరోనే హైలైట్ చేస్తూ చూపించాడని వాదిస్తున్నారు. ఇంతకీ ఈ కథేమిటో తెలుసుకుందామా.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ బ్రిటిష్ వారి దగ్గర పనిచేసే పోలీస్ ఆఫీసర్‌గా మనకు కనిపిస్తాడు. ఇక గోండు బిడ్డ కొమురం భీంగా తారక్‌ను ఓ రేంజ్లో చూపించారు. అయితే ఈ సినిమా కథలో భాగంగా పోలీస్ ఉద్యోగం చేస్తున్న రామ్, కొన్ని కారణాల వల్ల దూరంగా వెళ్లిపోతాడు. అప్పుడు ఎక్కువగా సినిమాలో కనిపించేది తారక్ మాత్రమే అని తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో తారక్ పాత్ర నిడివి చరణ్ పాత్రతో పోల్చుకుంటే కాస్త ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
ఇలా చరణ్ పాత్రను కావాలనే కొంచెం తగ్గించి, తారక్ పాత్రను హైలైట్ చేస్తున్నారని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, తారక్ పాత్రతో పాటుగా చరణ్ పాత్ర కూడా సమానంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ అంటోంది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ చిత్ర ట్రైలర్ ఓవైపు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుండగా, అప్పుడే ఈ సినిమాపై విమర్శలు కూడా వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతూ ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా ఆర్ఆర్ఆర్ అప్పుడే అదిరిపోయే బజ్‌ను క్రియేట్ చేస్తుండటం నిజంగా విశేషమని చెప్పాలి.