మెగాస్టార్ చిరంజీవి ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం నాలుగు సినిమాలను చేస్తున్నాడు. ఈ నాలుగు చిత్రాలు సెట్స్ మీదే ఉండగా.. అందులో బాబీ సినిమా కూడా ఒకటి. `మెగా 154` వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమాలోని చిరు లుక్‌ను విడుదల చేయగా.. అందులో ఆయన లుంగీ కట్టి, నోట్లో బీడీ పెట్టి ఊర మాస్ గెటప్‌గా కనిపించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా స్టోరీ లీకై నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
శ్రీలంక సముద్ర తీరం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందట. ఇందులో చిరంజీవి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని.. అయితే ముందుగా అది రివీల్ చేయకుండా ఇంటర్వెల్ టైమ్‌కు బయటికి వస్తుందని.. ఆ ట్విస్టుతోనే సినిమా రేంజ్ మరో లెవల్‌కి చేరుకుంటుందని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా, చిరంజీవి మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య`, మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్`, మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` చిత్రాలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటిల్లో ఆచార్య షూటింగ్ దాదాపు పూర్తి కాగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది.