నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బొంబాట్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాను ఊరమాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించడంతో ఈ సినిమా ఖచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తుందని అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత అనుకున్నదే అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ‘అఖండ’ అఖండమైన రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో ఈ సినిమా బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ చిత్రంగా నిలిచింది. కాగా ఈ సినిమాలో బాలయ్య నటవిశ్వరూపానికి కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ ప్రేక్షకులు ఊగిపోయారు.
ఇక బాలయ్య ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్కు థమన్ అదిరిపోయే బీజీఎం తోడవ్వడంతో ఈ సినిమా ఏ థియేటర్లో చూసినా హౌజ్‌ఫుల్ బోర్డులతో కనిపించింది. కాగా ఈ సినిమాతో బాలయ్య చాలా రోజుల తరువాత అదిరిపోయే సక్సెస్ అందుకోవడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా అదిరిపోయే వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం ముగిసే సరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.53 కోట్లకు పైగా షేర్ వసూళ్లు సాధించింది. షూటింగ్ మొదలు రెండేళ్ల గ్యాప్ తరువాత రిలీజ్ అయిన అఖండ చిత్రానికి బాక్సులు బద్దలయ్యే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా నిర్మాత కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు.
కాగా ఇప్పట్లో బడా సినిమాలు ఏవీ లేకపోవడంతో ఈ సినిమా మరో వారం పాటు తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. మరి ఈ సినిమా టోటల్ రన్లో ఎంతమేర కలెక్షన్స్ రాబడుతుందా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రాబట్టిన వసూళ్ల వివరాలు ప్రాంతాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం: 14.87 కోట్లు
సీడెడ్: 11.73 కోట్లు
ఉత్తరాంధ్ర: 4.56 కోట్లు
ఈస్ట్: 3.08 కోట్లు
వెస్ట్: 2.43 కోట్లు
గుంటూరు: 3.73 కోట్లు
కృష్ణ: 2.73 కోట్లు
నెల్లూరు: 1.98 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ : రూ.45.11 కోట్లు (రూ.71.30 కోట్లు గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 3.82 కోట్లు
ఓవర్సీస్: 4.56 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ 7 రోజుల కలెక్షన్లు: రూ.53.59 కోట్లు (రూ.87.9 కోట్ల గ్రాస్)