యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్ ఒక్కో అప్డేట్ను వదులుతూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌ను నిన్న గ్రాండ్‌గా విడుదల చేశారు.
ఎన్టీఆర్, చరణ్ క్యారక్టరైజేషన్స్ కు అద్దం పడుతూ ఆవిష్కరించిన ఈ ట్రైలర్ మెగా, నందమూరి అభిమానులనే కాదు యావత్ సినీ ప్రియులందరినీ ఆకట్టుకుంది. ట్రైలర్లో ప్రతి సన్నివేశం గూజ్ బమ్స్ తెప్పించేలా ఉంది. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటన చూడటానికి రెండు కళ్లూ సరిపోలేదు. వారిద్దరూ అంత అద్భుతంగా తమ పాత్రల్లో జీవించేశారు.
అయితే ఆర్ఆర్ఆర్ ట్రైలర్ చూశాక.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కాస్త గుర్రుగా ఉన్నారు. ట్రైలర్లో ఎన్టీఆర్ కంటే చరణ్ డామినేషన్నే ఎక్కువగా ఉందని, క్యారెక్టర్ పరంగా రామ్ చరణే కొన్ని రకాలుగా పైచేయి సాధించాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే లుక్స్ పరంగా కూడా తారక్ వెనుకబడ్డట్లు కనిపిస్తుంది. అందు వల్లనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాజమౌళిపై కోపంగా ఉన్నారట.
కానీ, ట్రైలర్ బట్టే ఓ అంచనాకు రావడం చాలా పొరపాటు. ఎందుకంటే, యాక్షన్ పార్ట్, లుక్స్ పరంగా చరణ్ డామినేషన్ ఉన్నప్పటికీ.. సినిమాలో కథ ప్రధానంగా తారక్ చుట్టూనే తిరుగుతుంది. అలాగే ఎమోషన్లలో తారకే హైలైట్ అవుతాడని మరియు సినిమాలో చరణ్ కంటే ఎన్టీఆర్ స్క్రీన్ స్పేసే ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.