దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ చిత్రం `(ఆర్‌ఆర్‌ఆర్)రౌద్రం రణం రుధిరం`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న దాదాపు 14 భాషల్లో విడుదల కానుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ షురూ చేసిన మూవీ మేకర్స్.. పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్, ట్రైలర్ ఇలా ఒక్కో అప్డేట్ వదులుతూ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. ఇక వచ్చే మూడు వారాలు తగ్గేదేలే అంటూ మరింత జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నారట. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ అధికారికంగా తెలియజేసింది.
`రాబోయే మూడు వారాలు దేశ వ్యాప్తంగా ఈవెంట్ లు, ఇంటర్వ్యూలు ఇంకా మరెన్నో అంశాలతో క్రేజీగా ఉండబోతోంది.. సిద్ధంగా ఉండండి` ట్విట్టర్ వేదికగా ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ పోస్ట్ పెట్టింది. అంతేకాదు, ఈ మూడు వారాలు ఆర్ఆర్ఆర్ మ్యాడ్ నెస్ అంటే ఏంటో చూపిస్తామని చెప్పుకొచ్చారు. దీంతో అందరి చూపు ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌పైనే పడింది.
కాగా, స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు కొమురం భీమ్ వితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించగా.. ఎం. ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు.