బిగ్‌బాస్‌లో ఆర్జే కాజల్ సంపాదన‌ ఎంతో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆఖ‌రి ద‌శ‌కు చేరుకుంది. మ‌రో వారం రోజుల్లో సీజ‌న్ 5 విజేత ఎవ‌రో తేలిపోనుంది. 14వ వారం నామినేషన్స్‌లో సిరి, షణ్ముఖ్, సన్నీ, ఆర్జే కాజల్, మానస్‌లు ఉండ‌గా.. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే కాజ‌ల్ ఎలిమినేట్ అయింది. దీంతో శ్రీరామచంద్ర, మానస్, సిరి, సన్నీ, షణ్ముఖ్ జ‌శ్వంత్‌లు ఫైన‌ల్‌కి చేరుకున్నారు.

మొద‌ట్లో ఓవ‌ర్ యాక్ష‌న్ చేసి నెగ‌టివిటీని మూట‌గ‌ట్టుకున్న కాజ‌ల్‌.. క్ర‌మ‌క్ర‌మంగా ఇంటి స‌భ్యుల‌తో పాటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను కూడా ఓన్ చేసుకుంది. ఎవరేమంటున్నా, ఎన్ని గొడవలైనా చిరునవ్వుతో వాటిని స్వీకరించే కాజ‌ల్‌.. చివ‌ర‌కు 14వ వారం బ్యాగ్ స‌ద్దేసింది. అయితే ఈ 14 వారాలకు గానూ కాజ‌ల్ బిగ్ బాస్ హౌస్‌లో భారీగా సంపాదించింది.

సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కాజల్‌కు వారానికి రూ. 2 లక్షల పైనే పారితోషికం ఫిక్స్‌ చేశారట. ఈ లెక్క‌న ఆమెకు దాదాపు 30 ల‌క్ష‌ల వ‌ర‌కు బిగ్ బాస్ నిర్వాహ‌కులు రెమ్యూన‌రేష‌న్ కింద ముట్ట‌జెప్పార‌ని జోరుగా ప్ర‌చారం న‌డుస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.

కాగా, డిసెంబర్‌ 19న బిగ్ బాస్ సీజ‌న్ 5 ఫైన‌ల్ ఎపిసోడ్ జరగబోతుంది. ప్ర‌స్తుతం నిర్వాహ‌కులు అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక‌ ఈసారి విన్నర్ ప్రకటించేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest