టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం `అనుభవించు రాజా`. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిగా.. నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించింది. ఈ మూవీలో కషీష్ ఖాన్ హీరోయిన్‌గా నటించగా.. పోసాని కృష్ణమురళి, అజయ్, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
భారీ అంచనాల నడుము నవంబర్ 26న విడుదలైన ఈ చిత్రం పెక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఫస్టాఫ్ హైదరాబాద్, సెకండాఫ్ పల్లెటూరు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో.. సెక్యూరిటీ గార్డ్ రాజుగానూ, జల్సారాయుడు లాంటి బంగార్రాజు పాత్రలోనూ రాజ్ తరుణ్ ఒదిగిపోయి నటించాడు. అయితే కథలో బలం ఉన్నప్పటికీ.. కథనం అంతగా మెప్పించలేకపోవడం సినిమాకు మైనస్‌గా మారింది. ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది.
అయితే గోపీ సుందర్ అందించిన సంగీతం, క్లైమాక్స్ వంటివి బాగానే అలరించాయి. మొత్తానికి యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో అనుభవించు రాజా డిసెంబర్ 17న స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఈ విషయాన్ని ఆహా వారు అధికారికంగా ప్రకటించారు.
ఇక ఇటీవల కాలంలో పలు చిత్రాలు థియేటర్స్‌లో ఆడకపోయినా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్‌గా నిలుస్తున్నారు. మరి అనుభవించు రాజా చిత్రం ఓటీటీలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే డిసెంబర్ 17 వరకు వెయిట్ చేయాల్సిందే.
Paisalu sampadinchadame kadu, danni anubhavinchadam kuda teliyali kada mari!
Adi ela anedi twaralo #AnubhavinchuRajaOnAHA from December 17.@itsRajTarun @AnnapurnaStdios @SVCLLP @Kashishkhannn @GavireddySreenu @GopiSundarOffl @adityamusic pic.twitter.com/lx1zGI0S7l— ahavideoin (@ahavideoIN) December 10, 2021