చైతూతో విడాకుల తర్వాత సమంత వరుస పెట్టి సినిమాలను ఒప్పుకుంటోంది. హాలీవుడ్ లోనూ అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ లోనే చిత్రంలో నటిస్తోంది. తెలుగులో గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమాలో సమంత ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది.స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా ఇటీవలే పూర్తయింది.
అయితే ఆ సాంగ్ కు సంబంధించి ఇవాళ మూవీ మేకర్స్ స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు
ఇవాళ సాయంత్రం 7:02 నిమిషాలకు స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేస్తున్నట్లు పుష్పమూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఈ మేరకు ఈ పాటకు సంబంధించి ఓ సమంత స్టిల్ ని కూడా విడుదల చేశారు.
‘ఊ.. అంటావా.. ఊ.. ఊ.. అంటావా’ అంటూ సాగనున్న ఈ పాటను చంద్రబోస్ రచించగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పుష్ప సినిమా నుంచి ఇది వరకు విడుదలైన లిరికల్ వీడియోలు యూట్యూబ్ లో రికార్డు సృష్టించాయి. సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్పెషల్ సాంగ్ లో సమంత కూడా ఉండడంతో ఈ పాట ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా.. అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా డిసెంబర్ 17వ తేదీన పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది.
Get ready to groove along with Queen @Samanthaprabhu2 for the 'Sizzling Song of The Year' 🔥🔥#OoAntavaOoOoAntava Today at 7:02 PM 💥💥#PushpaTheRise#PushpaTheRiseOnDec17 @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie pic.twitter.com/TztTZ8En2T
— Mythri Movie Makers (@MythriOfficial) December 10, 2021