ఆర్ఆర్ఆర్..ఇప్పుడు ఎవరి నోట విన్నా.. ఈ సినిమా గురించి టాపికే. నిన్న ఉదయం ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో భాషా భేదం లేకుండా అందరినీ ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ని చూసిన వారే మళ్లీ మళ్లీ చూస్తున్నారు. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ సెన్సేషన్ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తెలుగు వర్షన్ సెవెన్ అవర్స్ లో వన్ మిలియన్ లైక్స్ సంపాదించి..ఆ రికార్డు సాధించిన తొలి మూవీ గా పేరు తెచ్చుకుంది.
ఇక వన్డే వ్యూస్ పరంగా కూడా ఆర్ఆర్ఆర్ అన్ని చిత్రాల రికార్డులను అధిగమించింది. 24 గంటల పరిధిలో ఈ మూవీ అన్ని వెర్షన్ల ట్రైలర్లు కలిపి 53మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంది. మరే చిత్రమూ ఇంత స్పీడుగా ఇన్ని వ్యూస్ సాధించింది లేదు. తెలుగు వెర్షన్ ట్రైలర్ కు ఇప్పటి వరకు 21 మిలియన్ల వ్యూస్ రాగా..హిందీ వర్షన్ కూడా 21 మిలియన్ల వ్యూస్ సంపాదించుకుంది.
ఈ రెండు భాషల తర్వాత కన్నడలో 5.4 మిలియన్ల వ్యూస్, తమిళ్ లో 3.4, మలయాళ ట్రైలర్ 2.4 మిలియన్ల చొప్పున మొత్తం 53 మిలియన్ల వ్యూస్ ఈ మూవీ సాధించింది. ఈ మూవీ ముందు ముందు ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో వేచి చూడాలి. జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.