రేణు దేశాయ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. లేదు. మోడలింగ్ రంగంలో కెరీర్ మొదలు పెట్టిన రేణు.. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన `బద్రి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ద్వారా పవన్, రేణుల మధ్య ఏర్పడిన పరిచయం.. చివరకు ప్రేమ, సహజీవనం, పెళ్లి వరకు దారి తీసింది.
ఇక ఇద్దరు పిల్లలు(అకిరా, ఆద్య) పుట్టాక పలు మనస్పార్థాలు రావడంతో.. పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్‌లు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ మరో పెళ్లి చేసుకోగా.. రేణు మాత్రం పిల్లలను చూసుకుంటూ ఒంటరిగా ఉండిపోయింది. అయితే గతంలో తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని, తన పిల్లలకూ అది ఇష్టమేనని రేణు దేశాయ్ తెలిపిన సంగతి తెలిసిందే.
గప్‌చుప్‌గా ఎంగేజ్మెంట్ కూడా అయింది. కానీ, ఆ తర్వాత ఏమైందో ఏమో.. రేణు దేశాయ్ రెండో వివాహం ఆగిపోయింది. అయితే దీని వెనుక పవన్ కళ్యాణ్ హస్తం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. పవన్ కారణంగానే రేణు రెండో వివాహం చెడిపోయిందని టాక్.
కాగా, ఇటీవలె రేణు దేశాయ్ పిల్లలతో పూణె నుంచి హైదరాబాద్‌కి షిప్ట్ అయింది. ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసిన రేణు దేశాయ్.. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. అలాగే పలు వెబ్ సిరీస్‌లోనూ నటిస్తున్న ఈమె.. సోషల్ మీడియాలో మాత్రం యమా యక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌ను అలరిస్తుంటుంది.