సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో భీమ్లా నాయక్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆ సినిమా మలయాళంలో సూపర్ హిట్ కావడంతో తెలుగులోనూ కచ్చితంగా బంపర్ హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే టీజర్, పాటలు కూడా ఓ రేంజులో ఉండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
దానికి తోడు చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ పక్కా మాస్ పాత్రలో కనిపిస్తుండడంతో అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది. రానా ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తుండటం అదనపు ఆకర్షణ. ఈ సినిమా జనవరి 12 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేసే విషయమై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది.
జనవరి మొదటి వారంలో ఈ సినిమా ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. భీమ్లా నాయక్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తుండగా.. యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. సంక్రాంతి ఈ సినిమాతో పాటు రాజమౌళి -ఎన్టీఆర్ -చరణ్ ల ఆర్.ఆర్. ఆర్, ప్రభాస్ రాధే శ్యామ్ కూడా విడుదల అవుతుండడంతో సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారింది.