మీ మగ బుద్ధే వంకర బుద్ధి అంటున్న సామ్‌.. `పుష్ప‌` ఐటం సాంగ్ అదుర్స్‌!

December 10, 2021 at 7:57 pm

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతుండ‌గా.. సునీల్‌, అన‌సూయ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగం పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్న మేక‌ర్స్‌.. పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైల‌ర్ ఇలా ఒక్కో అప్డేట్‌ను వ‌దులుతూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా మేక‌ర్స్ ఈ సినిమాలోని `ఊ అంటవా మావ.. ఊఊ అంటావా మావ‌` అంటూ సాగే మాస్ మసాలా ఐటెం సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్‌లో టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత న‌టించింది. `కోక కోక కోక కడితే కొరకొరమంటు చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు, కోకా కాదు.. గౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే.. వంకర బుద్ధి..` అంటూ సాగిన ఈ సంగ్ మాస్ ఆడియన్స్ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది.

దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించిన ఆ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించ‌గా, ఇంద్రావతి చౌహాన్‌ మాస్‌ వాయిస్‌తో ఆలపించారు. ఇక‌ స‌మంత ఈ పాట‌లో పొట్టి పొట్టి దుస్తులు ధ‌రించి హాట్ హాట్ అందాలతో హీట్ పెంచేస్తోంది. మొత్తానికి అదిరిపోయిన ఈ సాంగ్ యూట్యూబ్‌లో తెగ వైర‌ల్ అవుతోంది. కాగా, ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది.

మీ మగ బుద్ధే వంకర బుద్ధి అంటున్న సామ్‌.. `పుష్ప‌` ఐటం సాంగ్ అదుర్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts