రౌడీ హీరోపై మ‌న‌సు పారేసుకున్న స్టార్ హీరో కూతురు..ఎవ‌రామె..?

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన ఈ యంగ్ హీరో.. చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ.. సౌత్‌తో పాటుగా నార్త్‌లోనూ భారీ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. సామాన్యులే కాదు తోటి సెల‌బ్రెటీలు సైతం ఈయ‌న‌కు ఫిదా అవుతుంటారు.

ఇక బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు, ప్ర‌ముఖ హీరోయిన్ సారా అలీ ఖాన్ సైతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై మ‌న‌సు పారేసుకుంది. క్ష‌య్ కుమార్, ధ‌నుష్‌ల‌తో ఈమె న‌టించిన చిత్రం `అత్రాంగి రే` డిసెంబర్ 24 వ తేదీన ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సారా అలీ ఖాన్‌ను.. రాపిడ్ ఫైర్ ప్ర‌శ్న‌లు అడ‌గ‌గా ట‌క‌ట‌కా స‌మాధానాలు ఇచ్చింది.

ఇందులో భాగంగానే ఏ దక్షిణాది నటుడు తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు అని ప్ర‌శ్నించ‌గా.. అందుకు ఏ మాత్రం ఆలోచించ‌కుండా ట‌క్కున‌ విజయ్ దేవరకొండ పేరును చెప్పేసింది సారా అలీ ఖాన్‌. అంతే కాదు, విజయ్ దేవ‌ర‌కొండ సూపర్ కూల్ అండ్‌ సో హాట్ అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

దీంతో ఆమె వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌తో `లైగ‌ర్‌` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. బాలీవుడ్ భామ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.