ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి పార్ట్‌ను `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. వరుస అప్డేట్స్ను వదులుతూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పుష్ప ట్రైలర్‌ను డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే దీని కంటే ముందే `టీజ్ ఆఫ్ పుష్ప ట్రైలర్` పేరుతో తాజాగా ఓ వీడియోను వదిలారు.
26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో.. సినిమాలోని కీలక పాత్రల్ని, థీమ్‌ని పరిచయం చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ దృశ్యాలన్నీ అత్యంత వేగంగా సాగుతాయి. అయినప్పటికీ ఈ టీజ్ అదిరిపోయిందని చెప్పాలి. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియో ట్రైలర్‌పై మరియు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
కాగా, ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌గా, రష్మిక శ్రీవల్లిగా కనిపించబోతున్నారు. అలాగే ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతుండగా.. అనసూయ కీలక పాత్రను పోషిస్తోంది. మరియు ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.