టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.
ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం, రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. వీటిపై ఇప్పటికే అధికారిక ప్రకటనలు కూడా వచ్చేశాయి.
ఇదిలా ఉంటే.. మహేష్ తాజాగా ఓ అరదైన ఘనతను సాధించాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహేష్.. తాజాగా ట్విట్టర్‌లో ఏకంగా 12 మిలియన్ ఫాలవర్స్‌ను సొంతం చేసుకున్నాడు. అంటే ఒక కోటి 12 లక్షల మంది మహేష్‌ను ఫాలో అవుతున్నారన్నమట. దీనితో 12 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఏకైన సౌత్ ఇండియన్ నటుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు అదిరిపోయే రికార్డ్‌ను సెట్ చేశాడు.