టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లగా కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే.
అయితే ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` డిసెంబర్ 17న తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇలాంటి తరుణంలో ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఈ న్యూస్ ఏంటంటే.. పుష్ప విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అయితే వాయిదా పడింది ఇక్కడ కాదులేండి.. సింగపూర్‌లో. పోస్ట్ ప్రొడెక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో.. సింగరపూర్‌లో డిసెంబర్ 17న విడుదల కావాల్సిన పుష్ప చిత్రాన్ని డిసెంబర్ 23కి వాయిదా వేశారు. దీంతో సింగపూర్‌లో ఉన్న బన్నీ ఫ్యాన్స్ తెగ ఫిల్ అయిపోతున్నారు. ఇక మిగిలిన చోట్ల మాత్రం అనుకున్న సమయానికే పుష్ప రిలీజ్ కానుంది.
కాగా, భారీ అంచనాలు ఉన్న పుష్ప సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బన్నీ పుష్ప రాజ్‌గా మాస్ లుక్‌లో కనిపించబోతుండగా.. రష్మిక శ్రీవల్లిగా మెరవబోతోంది.