బాల‌య్య షోలో పాన్ ఇండియా స్టార్ సంద‌డి..ఇక రికార్డులు బ‌ద్ద‌లే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలి సారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్ర‌సారం అవుతుండ‌గా.. బాల‌య్య త‌న‌దైన హోస్టింగ్‌తో అద‌ర‌గొట్టేస్తున్నారు. అలాగే ఈ షో మొద‌టి ఎపిసోడ్‌కి మంచు మోహ‌న్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి న్యాచుర‌ల్ స్టార్ నాని, మూడో ఎపిసోడ్‌కి బ్ర‌హ్మానందం, అనిల్ రావిపూడి గెస్ట్‌లు వ‌చ్చి ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశారు.

 

ఇక నాలుగో ఎపిసోడ్‌కి అఖండ టీమ్‌, ఐదో ఎపిసోడ్‌కి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు విచ్చేయ‌గా.. ఇవి త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే వినిపిస్తున్న లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. బాల‌య్య టాక్ షోలో సంద‌డి చేసేందుకు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ రాబోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే ఆయ‌న‌కు ఆహ్వానం అంద‌గా.. ఆయ‌న వెంట‌నే ఓకే చెప్పార‌ని తెలుస్తోంది.

అంతే కాదు,, బాల‌య్య – ప్ర‌భాస్‌ల ఎపిసోడ్‌ను త్వ‌ర‌లోనే చిత్రీక‌రించ‌నున్నార‌ని స‌మాచారం. మ‌రి నిజంగానే బాల‌య్య షోకు ప్ర‌భాస్ వ‌స్తే.. ఆ ఎపిసోడ్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయం అంటున్నారు నెటిజ‌న్లు. కాగా, ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఈయ‌న రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన `రాధే శ్యామ్‌` చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది.

ఈ పాన్ ఇండియా చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. ఇక మ‌రోవైపు ప్ర‌భాస్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్‌`, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో `ప్రాజెక్ట్ కె`, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌` చిత్రాల్లో న‌టిస్తున్నాడు.

Share post:

Latest