పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మొదటి సారి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రమే `భీమ్లా నాయక్`. మలయాళంలో విజయ వంతమైన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివికమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్‌లు నటిస్తున్నారు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అయితే అదే సమయంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్` రిలీజ్ కు సిద్ధం అయింది.
దీంతో భీమ్లా నాయక్ వాయిదా పడుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయంపై మేకర్స్ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చినా.. భీమ్లా నాయక్ విడుదల తేదీపై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో నిర్మాత నాగ వంశీ రంగంలోకి దిగి.. రూమర్స్‌కు స్ట్రోంగ్‌గా చెక్ పెట్టారు.
`భీమ్లా నాయక్.. 2022 జనవరి 12నే మీ ముందుకొస్తుంది` అని తెలుపుతూ.. పవన్‌తో దిగిన ఓ అదిరిపోయే పిక్‌ను ట్విట్టర్ ద్వారా నాగ వంశీ షేర్ చేశారు. దీంతో అటు పవన్, ఇటు రానా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
Just saw the Video Rush of #LaLaBheemla 🥁
Mark it guys, You're in for a BLAST on 12th JAN 2022 in THEATRES 💥🔥#BHEEMLANAYAKon12thJAN pic.twitter.com/OvBkrdULG6
— Naga Vamsi (@vamsi84) December 7, 2021