చిరు సినిమాలో నా సీన్ల తొలగింపు.. అమ్మ చనిపోయినంత బాధేసింది..!

కమెడియన్ పృథ్వీ రాజ్ కి, చిరంజీవి ఫ్యామిలీ కి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని కొద్ది రోజుల కిందట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రచారం ఎక్కువగా జరిగింది. అంతకుముందు చిరంజీవి రీ ఎంట్రీ లో నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో పృథ్వీ రాజ్ పై చిత్రీకరించిన కొన్ని సీన్లను తొలగింపుపై వివాదం చెలరేగింది. స్వయంగా పృథ్వీ రాజ్ సినిమా లో సీన్ల తొలగింపు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత మెగా ఫ్యామిలీ, పృథ్వీ రాజ్ మధ్య ఉన్న వివాదం సమసిపోయింది.

సైరా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి స్వయంగా స్టేజ్ పై పృథ్వీ రాజ్ గురించి మాట్లాడారు. తాజాగా పృథ్వీ రాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిరంజీవి ఫ్యామిలీ, తన మధ్య ఉన్న బంధంపై వివరణ ఇచ్చారు. ‘పెద్దాయన చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాలో నేను నటించా. అయితే ఆ సినిమా లెంగ్త్ ఎక్కువ కావడంతో నేను నటించిన కొన్ని సీన్లు తొలగించారు. ఆ విషయాన్ని కో డైరెక్టర్ నాకు ముందుగానే చెప్పాడు. అయితే ఆ సమయంలో పెద్దాయన సినిమాలో నా సీన్ల తొలగింపుపై బాధేసింది. సీన్ల తొలగింపు  అమ్మ చనిపోయినంత బాధ వేసింది. అయితే ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాలో తాను నటించిన సీన్లను కొనసాగించారు.

అయితే అప్పటి నుంచి నాకు మెగా ఫ్యామిలీ కి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరిగింది. ఒక టీవీ షోలో నాగబాబును కలుసుకోగా ఆయన ఆప్యాయంగా పలకరించారు. మెగా ఫ్యామిలీ కి నచ్చిన ఏకైక కమెడియన్ పృథ్వీ రాజ్ అంటూ..ఆయన అన్నారు.రాజకీయాలు వేరు..సినిమాలు వేరు..అని ఆ సందర్భంలో నాగబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ తో కూడా కాటమరాయుడు, గబ్బర్ సింగ్ సినిమాలో నటించా. ఇప్పటికీ నాకు మెగా ఫ్యామిలీకి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతోంది’ అని పృథ్వీ రాజ్ అన్నారు.