టాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్ మెన్‌గా గుర్తింపు పొందిన సీనియర్ హీరో రాజశేఖర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. డాక్టర్ చదవి చెన్నైలో కొన్నాళ్ల పాటు క్లినిక్‌ను నడిపిన రాజశేఖర్.. ఆ తర్వత నటనపై ఉన్న మక్కువతో వైద్య వృత్తిని పక్కనపెట్టి సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. ఈయన తొలి సినిమా వందేమాతరం.
ఈ సినిమా తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్న రాజశేఖర్.. 1991లో సహనటి జీవితను వివాహం చేసుకున్నాడు. అయితే వీరిది ప్రేమ వివాహం అని అందరూ అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. వాస్తవానికి హీరోగా దూసుకుపోతున్న తరుణంలో రాజశేఖర్ ఓ స్టార్ హీరోయిన్‌ను ప్రేమించాడట. ఈ విషయాన్ని ఎవరో కాదు.. స్వయంగా ఆయన భార్య జీవితనే గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.
జీవిత మాట్లాడుతూ.. `అందరూ అనుకున్నట్టు మాది ప్రేమ వివాహం కాదు.. ఆయన నాతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నప్పుడే ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను ప్రేమించారు. వాళ్ళిద్దరూ ప్రేమ వ్యవహారం మొత్తం నాకు తెలుసు. కానీ, ఆ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడం రాజశేఖర్ తల్లిదండ్రులకు ఇష్టం లేదు.
దాంతో వారిద్దరి పెళ్లి ఆగిపోయింది.
అయితే అనుకోకుండా రాజశేఖర్ అమ్మ గారికి ఒంట్లో బాగా లేకపోతే, నేను దగ్గరుండి చూసుకున్నాను. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయన అమ్మ, నాన్న నన్ను పిలిచి రాజశేఖర్ ను పెళ్లి చేసుకుంటావా ..? అని అడిగారు. రాజశేఖర్ ఒక ఫ్రెండ్‌గా బాగా తెలుసు కాబట్టి , సరే అని చెప్పాను.. అలా మా వివాహం జరిగింది` అంటూ చెప్పుకొచ్చింది. కానీ, రాజశేఖర్ ప్రేమించిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరన్నది మాత్రం జీవిత చెప్పలేదు. కాగా, రాజశేఖర్-జీవిత దంపతులకు ఇద్దురు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. వారే శివాని, శివాత్మిక. ప్రస్తుతం వీరిద్దరూ సినీ రంగంలోనే కొనసాగుతున్నారు.